Trivikram: మళ్ళీ పూజా హెగ్డే నే కావాలంటున్న త్రివిక్రమ్

Trivikram

డైరెక్టర్లలకి ఒక హీరో గాని, హీరోయిన్ గాని నచ్చిందంటే ఎక్కువగా వాళ్ళతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడటం సర్వ సాధారణం. అయితే ఈ విధంగా చేయడం చాలా కామన్ విషయమే అయినప్పటికీ చూసే వాళ్లకు మాత్రం ఈ విషయం మరోలాగా అర్థం అవుతూ ఉంటుంది. ఒకే హీరోయిన్స్ తో ఎక్కువగా వర్క్ చేస్తే ఆ హీరోయిన్ తో డైరెక్టర్ ఎఫైర్ పెట్టుకున్నారని,అదే హీరోలతో ఎక్కువగా వర్క్ చేస్తే ఫెవరేటిజం చూపిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ వస్తూనే ఉంటాయి.

ఇక అసలు విషయానికొస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ముందుగా లీడ్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను గుంటూరు కారం సినిమా నుంచి మేకర్స్ తప్పించారు. అయితే ఈ విధంగా పూజా హెగ్డే సినిమా నుండి తప్పించడం డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఏ మాత్రం నచ్చలేదట. కానీ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయనేం మాట్లాడలేదట.

ఇక లేటెస్ట్ గా చూస్తే త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తరువాత అల్లు అర్జున్ తో ఒక భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. గుంటూరు కారం సినిమా రిలీజ్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

- Advertisement -

అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ హీరోయిన్ గా పూజా హెగ్డే నే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. మేనేజర్స్ తో మాట్లాడి ముందుగానే పూజా డేట్స్ కూడా లాక్ చేయించాడని టాక్ వినిపిస్తోంది. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ అవడంతో అదే కాంబినేషన్ ను రిపీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కొంతమంది మాత్రం పూజా హెగ్డే అంటే త్రివిక్రమ్ కు మోజు అని అందుకే మళ్ళీ మళ్ళీ తన సినిమాలలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ రాబోయే సినిమాకు హీరోయిన్ మాత్రం ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు