RGV: ‘వ్యూహ’ రచనలో రెండో భాగానికి ‘శపథం’ చేసేసాడు?

RGV:

టాలీవుడ్ లో కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ ఆ తర్వాత తన ఫేడవుట్ అయిపోయాడు. కానీ గత పదేళ్లుగా రాజకీయాల నేపథ్యంలో సినిమాలు తీస్తూ బిజీ అవుతున్నాడు. ఒకప్పుడు కొందరు రాజకీయ నాయకుల మీదే సినిమాలు తీసిన ఈ సంచలన దర్శకుడు ఇప్పుడు ఏకంగా పలు, పార్టీల నేతల మీదే సినిమాలు తీయడం స్టార్ట్ చేసాడు.

గత ఎలక్షన్ల టైం లో “లక్ష్మీస్ ఎన్టీఆర్” అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలతో టీడీపీ నేత చంద్రబాబును తన డైలాగులతో వేసుకున్న ఆర్జీవీ, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల సమయం రావడంతో, జగన్ పార్టీకి సపోర్ట్ గా మళ్ళీ సినిమాలు తీయడం స్టార్ట్ చేసాడు. ఇప్పటికే “వ్యూహం” సినిమాతో ఆల్రెడీ సినిమా కూడా తీసేయగా, ఆ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. వ్యూహం ట్రైలర్ లో చంద్రబాబు తో పాటు, టాలీవుడ్ మెగా కాంపౌండ్ ని గట్టిగా టార్గెట్ చేసిన వర్మ, ఈ సారి మరింత వేడి పుట్టిస్తానంటున్నాడు.

వ్యూహం సినిమా రిలీజ్ కాకముందే, ఆ సినిమా సెకండ్ పార్ట్ కూడా తీస్తున్నానంటూ తన ట్విట్టర్ పేజీలో అనౌన్స్ చేసాడు ఆర్జీవీ. ఆ రెండు పార్ట్ కి శపథం అని టైటిల్ కూడా అనుకున్నట్టు చెప్పేసాడు.

- Advertisement -

ఇక ఆర్జీవీ వ్యూహ రచనలో భాగంగా తీస్తున్న శపథానికి ఈసారి ఎవర్ని టార్గెట్ గా ఎన్నుకున్నాడో అని ట్రేడ్ విమర్శకులు అప్పుడే లెక్కలు వస్తున్నారు. ఇక ఈ పార్ట్ లో కూడా గత సినిమాల్లో ఉన్న నటీనటులే నటిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు