Prabhas Upcoming Movie: సలార్ సాగదీత… మళ్లీ షూటింగ్ స్టార్ట్?

Prabhas Upcoming Movie

అన్ని అనుకున్నట్టే జరిగితే, మరో మూడు రోజుల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ సందడి ఉండేది. కానీ, డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందేలా సలార్ మూవీ టీం వాయిదాను అనౌన్స్ చేసింది. కొత్త రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేక పోవడంతో ఫ్యాన్స్‌తో పాటు సలార్ కోసం వెయిట్ చేస్తున్న వారిలోనూ కొంత వరకు అనుమానాలు ఉన్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది?. అసలు సినిమా షూటింగ్ పూర్తి అయిందా? అనే ప్రశ్నలు స్వయంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి కూడా వచ్చాయి.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ వినిపిస్తున్న కొన్ని వార్తలు చూస్తే, ఫ్యాన్స్ అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి. ఆ న్యూస్ ఏంటంటే..? సలార్ షూటింగ్‌కు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈ మధ్యే స్టార్ట్ అయిందట. హైదరాబాద్‌లోనే 8 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. అయితే దీనిలో ప్రభాస్ మాత్రం పాల్గొనకపోవచ్చని టాక్.

నిజానికి సలార్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అయితే ఇప్పుడు కొత్త షెడ్యూల్ ఎందుకు అనే డౌట్ రావొచ్చు. మూవీ యూనిట్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ 8 రోజుల షెడ్యూల్‌లో ప్యాచ్ వర్క్ చేయబోతున్నారట. నిజానికి ప్రతి సినిమాకు ప్యాచ్ వర్క్ ఉంటుంది. కానీ, 8 రోజుల పాటు ప్యాచ్ వర్క్ ఉండదు.

- Advertisement -

కానీ, ఇప్పుడు సలార్ ప్యాచ్ వర్క్ 8 రోజులు అంటే, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కడ వరకు వచ్చాయి? ఇంకెన్ని రోజులు చేస్తారు? అసలు ఈ ఏడాది రిలీజ్ చేసే ఆలోచన ఉందా? పోనీ వచ్చే ఏడాది సంక్రాంతికి అయినా రిలీజ్‌కి నోచుకుంటుందా? అంటూ ఎన్నో డౌట్స్… ఇంకెన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి సమాధానం రావాలంటే, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు మూవీ ప్రొడ్యూసర్స్ హంబోలే ఫిల్మ్స్ స్పందించాల్సిన అవసరం ఉంది.

ఇది కూడా చూడండి…

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు