Boyapati Srinu: ‘స్కంద’ క్లైమాక్స్ కి అదే ప్లస్ పాయింట్ అంటున్న రామ్..!

Boyapati Srinu:

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాల్లో ఒకటి “స్కంద”. రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్స్ సాంగ్స్ చూసిన తర్వాత బోయపాటి పాత సినిమాల స్టైల్ లోనే తెరకెక్కుతోందని తెలిసిపోయింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగి చాలా రోజులయింది కాబట్టి, మూవీ మేకర్స్ తదుపరి ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం జరిగింది.

ఇప్పటికే రామ్ పలు హిందీ ఇంటర్వ్యూలలో పాల్గొనగా, ఇప్పుడు తెలుగు ఇంటర్వ్యూ లలో కూడా పాల్గొంటూ తనవంతు ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇక ఈ ప్రమోషన్ లో భాగంగా స్కంద గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. యాంకర్ తో మాట్లాడుతూ స్కంద సబ్జెక్టు చెప్పినపుడు డైరెక్టర్ నాకు కథ చెప్పినదాని కన్నా ఆ కథనం నేరేట్ చేసిన విధానం బాగా నచ్చింది. అందుకే ఓకే చేశానన్నారు. ఇక స్కంద సినిమాలో పాటలన్ని ఇప్పటికే హిట్ అయ్యాయి. స్కంద సినిమా క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని అన్నాడు.

అయితే స్కంద సినిమాకి బిగెస్ట్ ప్లస్ పాయింట్ క్లైమాక్స్ ఫైట్ అని చెప్పగా, ఆ క్లైమాక్స్ లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో ఎత్తు అని అన్నాడు. ఆయన అందించిన మ్యూజిక్ వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అన్నాడు. అయితే థమన్ మ్యూజిక్ విషయంలో నెటిజన్లకు నమ్మకంగా ఉన్నా, బోయపాటి డైరెక్షన్ విషయంలోనే కొంచెం డౌట్ వస్తుందని అంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు