Sharukh khan: జవాన్ అరుదైన రికార్డు. చరిత్రలో ఒకే ఒక్కడు..!

Sharukh khan:

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఫుల్ జోరు మీదున్నాడు. ఈ హీరో గత ఏడాదికి ముందు అందరు స్టార్ హీరోల కన్నా డౌన్ లో ఉండేవాడు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఒక్క సినిమా కూడా కాలేకపోవడంతో షారుఖ్ ఫ్యాన్స్ కూడా చాలా డల్ అయ్యారు. అసలు బాలీవుడ్ లో ఈ మధ్య ఫ్యాన్స్ హంగామా చేసే సినిమాలు కూడా రాకపోవడంతో, అందరూ బాలీవుడ్ పని అయిపోయిందనుకున్నారు. కానీ ఒకే ఒక్క్కడు ఈ బాయ్ కాట్ ట్రెండ్ ని ఎదిరించి నిలబడి నిఖార్సైన హిట్లు కొట్టడమే గాక, తన స్టార్ డమ్ పై ఉన్న అనుమానాల్ని కూడా పటాపంచలు చేసేసాడు.

ఇక ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో అద్దిరిపోయే హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వడమే గాకుండా ఇండస్ట్రీ హిట్, దాంతో పాటు బాలీవుడ్ లో ఫస్ట్ 1000 కోట్ల సినిమాను కూడా అందించాడు. ఇది చూసిన బాలీవుడ్ వర్గాలు షాకయ్యారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ దిమ్మతిరిగేలా “జవాన్” సినిమాతో పఠాన్ ని మించిన ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నాడు షారుఖ్ ఖాన్. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో వచ్చిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ తెచ్చుకోవడమే గాక మరో సారి 1000కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం.

బాలీవుడ్ లో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే గాకుండా ఒకే ఇయర్ లో రెండు సార్లు 1000కోట్ల క్లబ్ లో చేరడం షారుఖ్ ఖాన్ స్టార్ డమ్ కి నిదర్శనం గా చెప్పొచ్చు. ఇక జవాన్ సినిమా కేవలం 18రోజుల్లో ఈ ఫీట్ ని సాధించగా, లాంగ్ రన్ లో మరో 100కోట్లయినా వసూలు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు