Vyuham Teaser2: ఈసారి మెగా కాంపౌండ్ ని గట్టిగా టార్గెట్ చేస్తున్నాడుగా?

Vyuham Teaser2:

టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అడిగితే అందరూ చెప్పే పేరు రామ్ గోపాల్ వర్మ. ఈ డైరెక్టర్ కెరీర్ బిగినింగ్ నుండి తన సినిమాలతో ఎదో ఒక కాంట్రవర్సీని సృష్టిస్తుంటాడని తెలిసిందే. ముఖ్యంగా రాజకీయాల నేపథ్యంలో ఎన్నో సినిమాలు తీసాడు. అయితే తన క్రియేటివిటీని ఎప్పుడో మర్చిపోయిన ఈ దర్శకుడు ప్రస్తుతం తన సినిమాలతో ప్రేక్షకులని కాకుండా పొలిటికల్ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు.

రక్త చరిత్ర మొదలుకొని ఎన్నో కాంట్రవర్సీ సబ్జెక్ట్ లు చక్కగా హ్యాండిల్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా సినిమాలు తీస్తున్నాడు. గత ఎలక్షన్ల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, సినిమాలతో టీడీపీ పార్టీ కి వ్యతిరేకంగా, చంద్రబాబుని విలన్ గా చూపిస్తూ సినిమాలు తీసిన ఆర్జీవీ, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరో సినిమాతో రెడీ అయ్యాడు.

వ్యూహం పేరుతో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలో మళ్ళీ చంద్రబాబుని విలన్ గా చూపిస్తూ, వైఎస్ జగన్ ని హీరోగా చూపిస్తున్నాడు. అయితే ఈసారి మెగా కాంపౌండ్ ని కూడా గట్టిగా టార్గెట్ చేసినట్టు తాజాగా రిలీజ్ అయిన వ్యూహం రెండో టీజర్ ద్వారా తెలుస్తుంది. ఫస్ట్ టీజర్ లో కేవలం చంద్రబాబునే టార్గెట్ చేయగా, ఈ సారి మెగాఫ్యామిలీ స్టార్స్ ని తన సినిమా ద్వారా గట్టిగా టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తుంది.

- Advertisement -

స్టోరీ వైస్సార్ మరణం తరువాత నుండి మొదలై ఇప్పటివరకు ప్రస్తుత ఎలక్షన్స్ టైం కి లింక్ చేస్తూ సినిమాని చూపించబోతున్నాడని టీజర్ లో తెలుస్తుంది. అయితే రెండో టీజర్ లో మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు, జగన్ పై వ్యూహ రచన చేస్తున్నట్టు చూపిస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకు ముందు తీసిన కాంట్రవర్సీ సినిమాల్లో కామెడీని జోడించి తీసినప్పటికి, ఈసారి సీరియస్ జోన్ లో వ్యూహం సినిమా ఉండబోతుందని అనిపిస్తుంది.

ఇక టీజర్ చివర్లో పవన్ ని చంద్రబాబు టార్గెట్ చేశాయని డైరెక్ట్ గానే చెప్తున్నాడు. ఈ సినిమాపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా, మెగా అభిమానులు మాత్రం ఆర్జీవీ పై గట్టిగా ఫోకస్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సినిమా పరంగా మెగా బ్రదర్స్ పై రామ్ గోపాల్ వర్మ చేసిన విమర్శలకు మెగాఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా వాళ్లనే టార్గెట్ చేస్తూ సినిమా చేస్తున్నాడంటే, ఈ సారి మెగా అభిమానులు కూడా గట్టిగానే ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. మరి సినిమా వచ్చేవరకు మరెన్ని కాంట్రవర్సీలకి తెరలేపుతాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు