RGV:వ్యూహం సాంగ్ చూస్తే బాబు బ్యాచ్ కి నిద్ర పట్టదు!

RGV:

ఎలక్షన్స్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆర్జీవీ తన “వ్యూహ” రచనకి పదును పెట్టాడు. ముఖ్యంగా చంద్రబాబు పార్టీ నేతలకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. అంటే ఈ పాటికి అర్ధమైపోయుండాలి.. కాంట్రవర్సీ లకి కేరాఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ లాస్ట్ టైం ఎన్నికల్లో వైసిపి కి అనుకూలంగా, చంద్రబాబు ని విలన్ గా చూపిస్తూ పలు సినిమాలు తీసాడన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది ఎలక్షన్ల నేపథ్యంలో ‘వ్యూహం’ అనే సినిమా తీస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

తన లాస్ట్ సినిమాల్లో టీడీపీని ముఖ్యంగా చంద్రబాబుని మాత్రమే టార్గెట్ చేసిన వర్మ, ఇప్పుడు తీస్తున్న సినిమాలో జనసేనాని పవన్ కళ్యాణ్ ని, అలాగే, కాంగ్రెస్ నేతలని కూడా గట్టిగా టార్గెట్ చేసాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో అది క్లియర్ గా తెలిసింపోయింది. ఇక ఆ ట్రైలర్లో చంద్రబాబు కంటే ఎక్కువగా పవన్ ని గెలికేసినట్టు అనిపించింది. తాజాగా వ్యూహం నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాడు.

సంస్కృత శ్లోకం నుండి స్టార్ట్ చేసి రాజకీయంగా, టిడిపి తో పాటు, కాంగ్రెస్ నేతల్ని కూడా విమర్శిస్తున్నట్టు ఆ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు వర్మ కావాలని ఈ పాట రిలీజ్ చేసాడని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇక ఈసారి మెగాస్టార్ ని ఈ వీడియోలో ఇన్వాల్వ్ చేయక పోవడం గమనార్హం.

- Advertisement -

అయితే సాంగ్ లో వచ్చిన చివరి డైలాగ్ మాత్రం టిడిపి నేతలకు అసలు నిద్ర పట్టకుండా చేస్తుందని చెప్పాలి. ఆ డైలాగ్ తో దివంగత నేత ఎన్టీఆర్ ని కూడా లాగినట్టు చూపించాడు కాంట్రవర్సీ కింగ్. అయితే వ్యూహం సినిమా థియేటర్లో రిలీజ్ కావడం అసాధ్యం అని తెలుస్తూనే ఉంది. ఆర్జీవీ గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా ఓటిటి రిలీజ్ కావచ్చు.

ఇక వ్యూహం నుండి వచ్చే నెక్స్ట్ సాంగ్ తో మరో పార్టీ నేతలని టార్గెట్ చేస్తూ ఉంటుందని సమాచారం. ఆ సాంగ్ ద్వారా దీన్ని మించిన రాజకీయ రగడ ఆర్జీవీ స్టార్ట్ చేస్తాడని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and

all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు