Kajal Aggarwal: నానాటికి దిగజారుతున్న కాజల్ ఏకంగా వేశ్య పాత్ర చేయడానికి కూడా సిద్ధం ?

Kajal Aggarwal

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోయిన కాజల్ అగర్వాల్ కు ఇప్పుడు సినిమాలు రావడమే కష్టమైపోతుంది. దాంతో వచ్చిన సినిమా ఏదైన సరే చేసుకుంటూ పోదాం అనుకుంటుందేమో గాని లేటెస్ట్ గా కాజల్ అగర్వాల్ ఏకంగా ఒక సినిమాలో వేశ్య పాత్ర చేయడానికి కూడా రెడీ అయింది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న లేటెస్ట్ చిత్రం భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ కు జోడిగా నటిస్తోన్న కాజల్ ఈ సినిమా తరువాత ఆమె ఒక తమిళ్, తెలుగు బై లాంగ్వేజికల్ సినిమా చేయబోతుందట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ చర్చలు కూడా జరిగిపోయాయని సమాచారం అందుతోంది . అయితే ఈ సినిమాలో కాజల్ ఒక ముదురు వయసు ఉన్న వేశ్య పాత్రలో కనిపించబోతుందని సమాచారం.

అయితే కాజల్ అగర్వాల్ వేశ్య పాత్రలో నటించడం తప్పా, ఒప్పా అనే విషయం పక్కన పెడితే కాజల్ కు ఇటీవలనే పెళ్లి, చిన్న వయసు ఉన్న బాబు కూడా ఉండగా, సినిమాల కోసం కాజల్ ఇలాంటి క్యారెక్టర్ చేయడం సమంజసం కాదని ఆమె అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. పెళ్లితరువాత నుంచి కూడా సెకండ్ ఇన్నింగ్స్ లోను మంచి సినిమాలే చేస్తున్న కాజల్ వేశ్య పాత్ర చేయడానికి మాత్రం ఆమె ఫ్యాన్స్ నుంచి కాస్త నెగిటివిటీ వస్తోంది. మరి అభిమానుల ఫీలింగ్స్ ను అర్థం చేసుకొని కాజల్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. లేక తనకేమి పట్టనట్టు సైలెంట్ గా సినిమా చేస్తుందా అనేది చూడాలి. ఇక కాజల్ అగర్వాల్ తెలుగులో భగవంత్ కేసరి సినిమాతో పాటు తమిళ్ లో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు