NTR-Balakrishna: తారక్‌పై బాలయ్యకు అంత కోపం ఎందుకు?

NTR-Balakrishna

జూనియర్ ఎన్టీఆర్‌పై బాలయ్యకు ఎందుకు అంత కోపం? ఇది కష్టంగా ఉన్నా నందమూరి ఫ్యాన్స్‌ నుంచే ఈ ప్రశ్న వస్తుంది. నందమూరి వారి ఫ్యామిలీ పంచాయితీలపై చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నా.. తారకరత్న సంతాప సభ నుంచి అవి నిజమే అని ఓ క్లారిటీ వచ్చింది. ఈ సంతాప సభలో తారక్, కళ్యాణ్ రామ్‌లను బాలయ్య చూసి చూడనట్టు వెళ్లిపోయిన ఒక వీడియో వైరల్ అయింది.

దీని తర్వాత తారక్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్యకు ఓ ప్రశ్న ఎదురైనప్పుడు ఓ తలతిక్క సమాధానం చెప్పి దాటేశాడు. ఇలా వరుస ఘటనలతో తారక్‌ని నందమూరి కుటుంబం దూరం పెడుతుందని అర్థమవుతుంది. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ పేరుతో 100 నాణేన్ని రాష్టపతి ద్రౌపతి ముర్ము విడుదల చేసింది. ఈ ఈవెంట్‌కి తారక్‌కి ఇన్విటేషన్ రాలేదు. ఇన్విటేషన్ రాకపోవడానికి కారణం బాలయ్యనే అని తారక్ అభిమానులు అంటున్నారు.

కానీ, నందమూరి ఫ్యామిలీ అయితే తారక్‌కి ఇన్విటేషన్ ఇచ్చామని చెబుతున్నారట. తారక్‌కి ఇన్విటేషన్ అందింతే, తన తాతకు ఇచ్చే అరుదైన గౌరవాన్ని చూడటానికి రాకుండా ఉంటాడా? తప్పకుండా వస్తాడు.

- Advertisement -

మరి ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వలేదు? తారక్‌కు ఇన్విటేషన్ రాకపోవడానికి రీజన్ బాలయ్యనే? అనే ప్రశ్నలు ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‌ను వెంటాడుతున్నాయి.

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు