Victory Venkatesh: ప్రేమించిన అమ్మాయితోనే రాఖీ కట్టించుకున్న హీరో వెంకటేష్..?

Victory Venkatesh

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ కెరీర్ స్టార్టింగ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు.

అప్పట్లో విక్టరీ వెంకటేష్ – సౌందర్య జంటకి మంచి క్రేజ్ ఉండేది. ఈ జంట తెరపై కనిపిస్తే చాలు బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అనే టాక్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో రాజా, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం, దేవీపుత్రుడు, జయం మనదేరా వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. అయితే విక్టరీ వెంకటేష్ సౌందర్యని ఎంతగానో ఇష్టపడ్డారు.

కానీ ఈ విషయంలో రామానాయుడు కలగజేసుకోవడంతో వీరి ప్రేమ అక్కడితోనే ఆగిపోయింది. అంతే కాదు ప్రేమించిన సౌందర్య చేతులతో వెంకటేష్ రాఖి కూడా కట్టించుకున్నాడట. విక్టరీ వెంకటేష్ కి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే నీరజతో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.

- Advertisement -

అయితే వెంకటేష్ – సౌందర్య మధ్య జరుగుతున్న విషయం తెలుసుకున్న రామానాయుడు తన కోడలి జీవితం నాశనమవుతుందనే కారణంతో కొడుకుకి వార్నింగ్ ఇచ్చారట. ఆ సమయంలో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సౌందర్య రామానాయుడుకి క్లారిటీ కూడా ఇచ్చిందట. అయినప్పటికీ కోడలు జీవితం దృష్టిలో పెట్టుకొని రాఖీ కట్టమని చెప్పడంతో సౌందర్య రాఖీ కూడా కట్టడానికి ఒప్పుకొని కట్టేసిందట. అప్పట్లో ఈ న్యూస్ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు