Anu emmanuel comments viral : అల్లు శిరీష్ తో డేటింగ్ పై అను ఇమ్మానుయేల్ క్లారిటీ

Anu emmanuel comments viral

గత కొద్దీ రోజుల క్రితం వరకు అల్లు శిరీష్ , హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన ఉర్వశివో రాక్షసీవో సినిమాతో మొదలైన ఈ రూమర్స్ అనాది కాలంలో నే చాలా పాపులర్ అయ్యాయి.

అయితే ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు అను ఇమ్మానుయేల్ గాని, అల్లు శిరీష్ గాని పబ్లిక్ గా నోరు విప్పింది లేదు. ఉర్వశివో రాక్షసీవో సినిమా ప్రమోషన్స్ కు ఈ రూమర్స్ హెల్ప్ అవుతాయనుకున్నారేమో గాని పబ్లిక్ గా వీరిద్దరూ ఈ రూమర్స్ పై స్పందించలేదు. దాంతో నిజంగానే అను ఇమ్మానుయేల్, అల్లు శిరీష్ ప్రేమలో ఉన్నారెమో అని అంత అనుకున్నారు. కాగా లేటెస్ట్ గా మాత్రం ఈ రూమర్స్ పై హీరోయిన్ అను ఇమ్మానుయేల్ మొదటిసారి నోరు విప్పింది.

టాలీవుడ్ లో వరుస ఫ్లాప్ సినిమాలతో అందం ఉన్న హిట్స్ లేని ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ్- తెలుగు బై లాంగ్వేజికల్ సినిమాగా తెరకెక్కుతున్న జపాన్ సినిమాలో నటిస్తోంది. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. ప్రమోషన్స్ ను ఇటీవలనే మూవీ టీం స్టార్ట్ చేసింది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ అల్లు శిరీష్ తో డేటింగ్ రూమర్స్ పై స్పందించింది.

- Advertisement -

తనకు అల్లు శిరీష్ కేవలం స్నేహితుడు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. అసలు ఉర్వశివో రాక్షసీవో సినిమాకు ముందు గాని ఆ సినిమా రిలీజ్ తరువాత గాని శిరీష్ ను తాను కలవలేదని చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చేస్తున్నప్పటి నుండి వాళ్ళ ఫ్యామిలీతో తనకు మంచి అనుబందం ఉందని తెలిపింది. అయితే ఈ రూమర్స్ ను మొదట్లో తాను ఎక్కువగా పట్టించుకోలేదని కానీ వాళ్ళ అమ్మ ఈ రూమర్స్ చూసి చాలా బాధపడిందని చెప్పింది. ఇక అను ఇమ్మానుయేల్ అల్లు శిరీష్ తో డేటింగ్ రూమర్స్ పై ఇచ్చిన క్లారిటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు