Japan: ‘దొంగ’ కథలకు పెరుగుతున్న డిమాండ్..!

ఒకప్పుడు అడవి దొంగ, జేబు దొంగ వంటి సినిమాలు దొంగ కథ ప్రధానాంశంగా వచ్చి హిట్ అయ్యాయి. అయితే తర్వాత కాలంలో అలాంటి కథలతో వచ్చిన సినిమాలు చాలావరకు తగ్గాయి అనే చెప్పాలి. ప్రస్తుతం మళ్లీ దొంగ కథల ట్రెండ్ మొదలైనట్టు కనిపిస్తుంది. మాస్ మహారాజ రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి సినిమాఫై అంచనాలు పెంచింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

తాజాగా, కోలీవుడ్ హీరో కార్తీ కూడా దొంగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని వార్తలొస్తున్నాయి. రాజా మురుగన్, కార్తీ కాంబినేషన్లో ఇటీవలె మొదలైన జపాన్ సినిమాలో కార్తీ దొంగ క్యారెక్టర్లో నటించనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కార్తీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఆ సినిమా టీజర్ ఆసక్తిని పెంచుతోంది. ఇక జపాన్ కథ విషయానికి వస్తే, 2009లో తమిళనాట ట్రేండింగ్ లో నిలిచిన గజ దొంగ మురుగన్ కథ ఆధారంగా సినిమా రూపొందనుందని సమాచారం అందుతోంది. రవితేజ, కార్తీలు ఇద్దరికీ మంచి టైమింగ్ ఉన్న నేపథ్యంలో దొంగ క్యారెక్టర్లను అలవోక పండించగలరని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్ కి తమిళ్ లో కార్తీ వాయిస్ ఓవర్ ఇవ్వటం, ఇప్పుడు కార్తీ కూడా దొంగ కథతో సినిమా చేస్తుండటం యాదృచ్చికం అనే చెప్పాలి. రావణాసుర సినిమాతో డిజాస్టర్ అందుకున్న రవితేజకి టైగర్ నాగేశ్వరరావు సినిమా హిట్ అవ్వటం కీలకం కాగా, పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో తమిళ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీ, అదే ఊపుతో జపాన్ సినిమాతో హిట్ అందుకుంటాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు