Japan : అను ఇమ్మాన్యూయేల్ అందుకే పనికొస్తుందన్న స్టార్ హీరో..?

మలయాళీ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మజ్ను సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళం లో కెరీర్ మొదలుపెట్టిన అను ఇమ్మాన్యూయల్.. టాలీవుడ్ లో తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంది.

దీంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుంది. అయితే ఇప్పటివరకు ఈ అమ్మడు ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ లేకపోవడం గమనార్హం. కెరీర్ ప్రారంభంలో అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించిన అనూ.. ఆ తరువాత గ్లామర్ షో చూపించడంలో కుర్రకారుని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చాలా సినిమాలలో హద్దులు మీరి నటించింది ఈ బ్యూటీ. హీరోలతో రొమాన్స్, ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలలో నటించింది. అయినా సరే ఈ ముద్దుగుమ్మని జనాలు ఎంకరేజ్ చేయలేకపోయారు. అయితే ఓ స్టార్ హీరో షూటింగ్ స్పాట్ లోనే అను ఇమ్మానుయేల్ ని ఏడిపించాడని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది.

షూటింగ్ సమయంలో ఓ రొమాంటిక్ సన్నివేశం ఉండడంతో దర్శకుడు అనూతో భయపడుతున్నారా..? అని అడిగారట. దీంతో పక్కనే ఉన్న హీరో.. ఆమెకి ఇటువంటివంటే భయం ఉండదు.. ఇంట్రెస్ట్ ఉంటుందని అన్నాడట. అంతేకాదు ఆమె ఎంతమంది హీరోలతో లిప్ లాక్ చేయలేదు..? అని మొహం పైనే పచ్చిగా మాట్లాడారట. ఆమె కేవలం రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే పనికి వస్తుందనే విధంగా కామెంట్ చేయడంతో స్పాట్ లోనే ఏడ్చేసిందట అనూ. దీంతో ఆ హీరో సరదాకి కామెంట్ చేశాను..! అంటూ సారీ చెప్పాడట. దీంతో చాలా బాధపడ్డ అనూ ఆ సినిమా నుంచి బయటకు వచ్చేయాలనుకున్నప్పటికీ గతిలేక ఆ సినిమాలో నటించాల్సి వచ్చిందట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు