James Cameron: ఓటిటీ లోకి వచ్చేస్తున్న విజువల్ వండర్

హాలీవుడ్ విజువల్ వండర్ “అవతార్” సినిమా గురించి తెలియని వారుండరు. అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరే లెవెల్. వేరే గ్రహంలో జీవిస్తున్న మనుషుల్లాంటి గ్రహాంతర వాసులు అక్రమంగా తమ చోటుని ఆక్రమించుకోవడానికి వచ్చిన భూగ్రహ వాసుల్ని ఎదుర్కొని తమ వారిని ఎలా రక్షించుకొన్నారన్నదే కథ. మాములు కథే అయినా ఆ సినిమాను టెక్నికల్ గా, విజువల్స్ పరంగా అద్భుతంగా తెరకెక్కించడంతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఇక రీసెంట్ గా అవతార్ సినిమాకు సిక్వెల్ గా వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ ను కూడా అంతే అద్భుతంగా చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించాడు. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా కూడా కలెక్షన్ల వర్షం కురిపించి హాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. మొదటి పార్ట్ భూమి మీద అయితే, రెండో పార్ట్ నీటిలోపల జరుగుతుంది. అవతార్ కంటే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు తో తెరకెక్కిన ” అవతార్ ది వే ఆఫ్ వాటర్” ప్రపంచ వ్యాప్తంగా 2.3 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల్లోనే అత్యధికంగా 107 కోట్లకి పైగా వసూలు చేసింది.

తాజాగా ఈ సినిమా ఒటిటిలో విడుదల అవుతుంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు జూన్7 న ప్రముఖ ఓటిటి ఫ్లాట్ఫామ్ అయిన హాట్ స్టార్ లో విడుదల రిలీజ్ అవుతుంది. అయితే సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత కూడా ఈ సినిమాను ఓటిటి లో చూస్తారా అంటే ఖచ్చితంగా చూస్తారని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా పైరసీ అందుబాటులో ఉన్నా ఇలాంటి సినిమాను పైరసీలో చూడాలని అనుకోరు. ఎందుకంటే ఆ విజువల్ వండర్ ని ఎవరైనా సరే ఎంత క్లారిటీ తో చూస్తే అంత బాగుంటుందని అనుకుంటారు. ఎందుకంటే ఈ సినిమా పబ్లిక్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటింది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు