Balakrishna Insults NTR: బాలకృష్ణ ఇగో పీక్స్ కి చేరిందా – ముదురుతున్న నందమూరి పంచాయితీ..!

Balakrishna Insults NTR

బాలకృష్ణ భోళా మనిషి, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న మనిషి అని తరచూ వింటూనే ఉంటాం కానీ, బాలయ్యలో ఇంకో యాంగిల్ అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. అదేంటంటే, మొండితనం, అహంకారం, గర్వం. గతంలో చాలా సార్లు అహంకారంతో, గర్వంతో చేసిన వ్యాఖ్యల వల్ల విమర్శలు ఎదుర్కొన్నాడు కూడా. మళ్ళీ ఇప్పుడు మరోసారి బాలకృష్ణ తన అహంకారాన్ని బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు పేరిట 100రూపాయల వెండి నాణేన్ని లాంచ్ చేస్తున్న సందర్బంగా ఈ నెల 28న లాంచింగ్ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీకి చెందిన అందరికి ఆహ్వానం అందింది ఒక్క ఎన్టీఆర్ కి తప్ప.

ఫ్యామిలీ ఫంక్షన్స్ కి జూనియర్ పిలవకుండా అవమానించటం ఇదేమి ఫస్ట్ టైమ్ కాదు. గతంలో కూడా చాలాసార్లు ఫ్యామిలీ ఫంక్షన్స్ సందర్బంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ను పిలవకుండా అవమానించాడు. మళ్ళీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమానికి పిలవకుండా ఎన్టీఆర్ పై తనకున్న ద్వేషాన్ని బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యపై ఫైర్ అవుతున్నారు. తారకరత్న సంతాప సభ సాక్షిగా కూడా బాలకృష్ణ కు గౌవరవంగా లేచి నమస్కరించిన తారక్, కళ్యాణ్ రామ్ లను చూసి చూడనట్టు వ్యవహరించి ఘోరంగా అవమానించాడు. ఓ మీడియా ఇంటర్వ్యూలో కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై యాంకర్ ప్రశ్నించగా తలతిక్క సమాధానం చెప్పి దాటవేశాడు.

వాస్తవానికి ఎన్టీఆర్ చిన్నతనం నుండి నందమూరి కుటుంబం ద్వేషిస్తూ ఉండేది కానీ, సినిమాల్లోకి వచ్చి ఇండస్ట్రీ హిట్స్ అందుకొని స్టార్ హీరోగా ఎదిగిన క్రమంలో బాలకృష్ణ సహా నందమూరి కుటుంబం మొత్తం ఎన్టీఆర్ చుట్టూ చేరింది. అలా ఎన్టీఆర్ ఇమేజ్ రోజురోజుకి పెరగటం, సినిమాల్లోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఎన్టీఆర్ కి క్రేజ్ పెరగటంతో మెల్లిగా  ఎన్టీఆర్ ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు కుటుంబ సభ్యులు. ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య దూరం ప్రధాన కారణం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని కూడా టాక్ ఉంది. రామారావును ఘోరంగా అవమానించి పార్టీకి దూరం చేసి పగ్గాలు లాక్కున్న చంద్రబాబు మళ్ళీ పార్టీ ఆధిపత్యం నందమూరి కుటుంబానికి దక్కకుండా జాగ్రత్త పడుతూ ఆ కుటుంబంలో ఎవరినీ రాజకీయంగా  ఎదగకుండా చేశాడు.

- Advertisement -

పలు సందర్భాల్లో తనను వ్యతిరేకించిన హరికృష్ణను కూడా పార్టీకి దూరం చేసాడు చంద్రబాబు. ఆ తర్వాత బాలకృష్ణ కూతురికి లోకేష్ కి పెళ్లి చేసి బాలకృష్ణను తన అదుపులో పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎక్కడ ఎదుగుతాడో అన్న అభద్రతా భావంతో ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబానికి పూర్తిగా దూరం చేసాడు.

తరచూ తెలుగు జాతి, ఆత్మ గౌరవం అంటూ డైలాగులు చెప్పే బాలయ్య చంద్రబాబు మాయలో పడి సొంత అన్న కొడుకు పట్ల ద్వేషం పెంచుకొని ఇలా అవమానించటం మూర్ఖత్వమే అని చెప్పాలి. ఎన్టీఆర్ రాజకీయ శక్తిగా ఎదిగితే తన కొడుకు లోకేష్ భవిష్యత్తుకి భరోసా ఉండదన్న స్వార్థపూరిత ఆలోచనతో చంద్రబాబు వేసిన ప్లాన్ లో బాలయ్య కీలక పాత్ర పోషించటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది.

నిజంగా బాలకృష్ణకు ఏ మాత్రం తెలివి ఉన్నా కూడా RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తారక్ ను దగ్గరకు తీసుకొని అటు సినిమాల్లో, ఇటు పాలిటిక్స్ లో తన కుటుంబానికి పూర్వ వైభవం వచ్చేలా ప్లాన్ చేసేవాడు. అసలే వయసు పైబడ్డ చంద్రబాబు ఒక పక్క, జనాల్లో మినిమమ్ క్రేజ్ లేని లోకేష్ ల ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ వెంటిలేటర్ మీద ఉన్న పేషేంట్ లా తయారయ్యింది. తారక్ పార్టీ పగ్గాలు చేపడితేనే టీడీపీకి పునర్వైభవం వస్తుందని చాలా మంది పార్టీ కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇకనైనా బాలయ్య కళ్ళు తెరిచి నాన్న గారు, వంశం, బ్లడ్డు, బ్రీడు అన్న పనికిమాలిన భ్రమల్లో నుండి బయటపడి తారక్ ని దగ్గర తీసుకొని నందమూరి ఫ్యామిలీకి సినీరంగంలో, రాజకీయరంగంలో పునర్వైభవం వచ్చేలా మసులుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు