Sunnydeol: బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న గదర్2

Gadar 2 is shaking the box office

బాలీవుడ్ లో ఈ వారం భారీ అంచనాలతో విడుదలైన సినిమా గదర్2. ఎప్పుడో 22యేళ్ళ కిందట వచ్చిన గదర్ ఏక్ ప్రేమ్ కథ సినిమాకి సీక్వెల్ ఇది. మొదట ఈ సినిమా అనౌన్స్ అయినపుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా హీరో సన్నీ డియోల్ ఫేడ్ అవుట్ అయ్యి పదిహేనేళ్ల పైనే అయింది. కానీ ఎప్పుడైతే గదర్ 2 ట్రైలర్ రిలీజ్ అయిందో, సన్నీ డియోల్ ఫ్యాన్స్ మళ్ళీ నిద్ర లేచారు. అపొసిట్ లో అక్షయ్ కుమార్ OMG2 ఉన్నా కూడా ఈ సినిమాకే ఓటేశారు ఆడియన్స్.

గదర్2 కి ఇంత హైప్ రావడానికి ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన సెన్సషనే కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జనరేషన్ ఆడియన్స్ కి గదర్ సినిమా ప్రత్యేకత గురించి పెద్దగా తెలియకపోవచ్చు గాని, అప్పటి ఆడియన్స్ కి 90స్ ఆడియన్స్ కి మాత్రం ఓ రేంజ్ సినిమా. ఆరోజుల్లోనే 100కోట్ల వరకు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అయింది గదర్.

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా రిలీజ్ అయిన గదర్2 కూడా మంచి టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే 40కోట్ల కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. మామూలుగా బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకే ఈ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయి. ఇక రెండోరోజు అంచనాలను మించిపోయి ఏకంగా 43 కోట్లు కొల్లగొట్టింది. దీంతో మూడో రోజుకే గదర్2 వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సన్నీ డియోల్ చాలా ఏళ్ళ తరువాత బ్లాక్ బస్టర్ కొట్టడంతో బాలీవుడ్ బడాహీరోలందరూ సన్నీ డియోల్ ని విష్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు