Gadar: బాలీవుడ్ లోనూ మొదలైన రీ రిలీజ్ ట్రెండ్..

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు నటించిన పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పోకిరి తో మొదలైన ఈ ట్రెండ్ ఖుషి సినిమాతో పీక్స్ కి చేరింది. ఆయా స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలే కాదు ఆరెంజ్ లాంటి ప్లాప్ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ ట్రెండు సీనియర్ ఎన్టీఆర్ సినిమాలవరకు పాకింది. ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు, సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు కూడా రీ రిలీజ్ అయ్యి మెప్పించాయి. రీసెంట్ గా బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు ఆయన బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయ్యింది.

అయితే ఈ రీ రిలీజ్ సినిమాల ట్రెండు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కి పాకేసింది. బాలీవుడ్ స్టార్ అయిన సన్నీ డియోల్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా “గదార్” ఏక్ ప్రేమ్ కథ” సినిమా రీ రిలీజ్ అయ్యింది. అప్పుడు ఎలాటి రెస్పాన్స్ ఈ సినిమాకు వచ్చిందో ఇప్పుడు కుడా అదే టాక్ తో సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా. అయితే ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేయడానికి కారణం వేరే ఉంది. సన్నీ డియోల్ నటించిన గదార్ చిత్రం 2000 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. భారత్, పాకిస్థాన్ ల మధ్య జరిగే వలసల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ గా “గదార్ 2” వస్తుంది.

గదార్2 సినిమాపై హైప్ పెంచడానికి అందరూ మర్చిపోయిన పాత సినిమా గదార్ ని రీ రిలీజ్ చేసారు. ఇక రిలీజ్ అయిన మూడు రోజుల్లో 1.35 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఇది సన్నీ డియోల్ రీసెంట్ గా రిలీజ్ అయినా చిత్రాల కంటే ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం విశేషం. ఇక గదార్2 సినిమా ఆగష్టు11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతుండగా, అదే రోజు విడుదలవుతున్న యానిమల్, OMG2 సినిమాలతో పోటీ పడనుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు