Niharika konidela: విడాకులని చెబుతూ ప్రెగ్నెంట్ అయిన నిహారిక..?

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మెగా కుటుంబం నుండి ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ నిహారిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకోలేకపోయింది. ఈమెకు వెండితెరపై అంతగా కలిసి రాలేదు. కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది. కథలో ఎంపికలో పొరపాట్లు, సక్సెస్ రేట్ పెద్దగా లేకపోవడంతో నిహారిక గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోయింది.

ఇక నిహారిక వ్యక్తిగత విషయానికి వస్తే.. గత కొద్ది రోజులుగా నిహారిక మీద చాలా రూమర్లు వినిపిస్తున్నాయి. నిహారిక – జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని, వారు విడిపోయారని, విడాకులు తీసుకుంటున్నారు అంటూ అనేక వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. అంతేకాదు వారి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేశారు. ఈ వార్తలపై వారు ఇంతవరకు స్పందించలేదు. విడాకుల వార్తల గురించి పట్టించుకోకుండా చైతన్య – నిహారిక ఎవరి పనివారు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు.

ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా మారిన నిహారిక ఇటీవల అదిరే ట్విస్ట్ ఇచ్చింది. పుల్లటి మామిడికాయలు తింటూ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ తో.. “సమ్మర్ అంటే మ్యాంగోస్ లేకుండా ఎలా..?” అనే క్యాప్షన్ యాడ్ చేసింది. దీంతో మొన్నటి వరకు విడాకులు తీసుకోబోతున్నారని అన్నవారే.. ఇప్పుడు ఏదైనా విశేషమా..? ప్రెగ్నెంటా..? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిహారిక గురించి ఎటువంటి వార్తలు వచ్చిన క్షణాలలో స్పందించే నాగబాబు.. ఈ విడాకుల వార్తలపై ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. తాజాగా నిహారిక అన్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలా నిశ్చితార్థం లో కూడా చైతన్య కనిపించకపోవడంతో ఈ విడాకుల వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు అయింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు