Teddy: సినిమాలకి దూరంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న “అఖిల్” హీరోయిన్

సాయేశా సైగల్.. ఈ పేరుతో పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు గాని, “అఖిల్” సినిమా హీరోయిన్ అంటే ఇట్టే చెప్పేస్తారు. ముంబై కి చెందిన ఈ భామ సినిమాల్లో ఇంట్రెస్ట్ తో మోడలింగ్ చేసింది. ఆ తర్వాత తెలుగులో అక్క్కినేని అఖిల్ నటించిన “అఖిల్” ది పవర్ అఫ్ జువా సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది. అయితే మొదటి సినిమానే డిజాస్టర్ అవడంతో తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. అందువల్ల కోలీవుడ్ కి వెళ్ళింది ఈ భామ. వణమగన్ సినిమాతో ఇంట్రీ ఇవ్వగా, ఆర్య తో నటించిన ఘజినికాంత్ తో హిట్ అందుకుంది.

సాయేషా సైగల్ ఆ సినిమాతో హిట్ అందుకోవడమే కాదు ఆ హీరో అయిన ఆర్యతో ప్రేమలో పడింది. అప్పట్నుంచే డేటింగ్ లో ఉన్న ఇద్దరూ తమ ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ కప్పాన్, టెడ్డి సినిమాలో కలిసి నటించారు. ఇక 2019 లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇప్పుడు ఒక పాప కూడా ఉంది. అయితే పాప పుట్టిన తర్వాత సాయేషా సైగల్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

రీసెంట్ గా తన భర్త ఆర్యతో కలిసి సండే రోజు వెకేషన్ కి వెళ్లినట్టు పోస్ట్ చేసింది. చివరిగా సాయేషా కన్నడ మూవీ యువరత్న లో నటించిన ఈ భామ ఫ్యూచర్ లో సినిమా చేసినా అది తన భర్త ఆర్య తోనే చేస్తానని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది సాయేషా. అటు ఆర్య మాత్రం వరుస సినిమాలతో బిజీ అవుతూ ఫ్యామిలీకి కూడా టైమ్ ఇస్తూ బెస్ట్ హస్బెండ్ అనిపించుకుంటున్నాడు. అయితే సాయేషా సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా లో మాత్రం ఎప్పటికప్పుడు సందడి చేస్తూ పోస్ట్లు పెడుతూ తన ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు