Rambantu: బాలనటిగా తన మొదటి సినిమాను గుర్తు చేసుకున్న హీరోయిన్

ఐశ్వర్య రాజేష్.. తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్ లో గుర్తింపు తెచ్చుకుని అక్కడ పాపులర్ అయిన ఈ యువ నటి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను సినిమాలున్నాయి. రీసెంట్ గా “ఫర్హానా” సినిమాతో వచ్చి హిట్ కొట్టిన ఐశ్వర్య ఇప్పుడు తమిళ్ లో మూడు మలయాళంలో మరో మూడు సినిమాలతో బిజీ గా ఉంది.

ఇక తెలుగులో ఈ భామ కౌసల్యకృష్ణమూర్తి ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పర్వాలేదనిపించగా నటిగా ఐశ్వర్య కు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ఆ తర్వాత రిపబ్లిక్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్ వంటి సినిమాల్లో నటించింది. అయినా ఏ సినిమాలు అంతగా ఆడకపోయే సరికి మళ్ళీ కోలీవుడ్ కే చెక్కేసింది. ఇదిలా ఉండగా ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగు హీరో అయిన రాజేష్ కూతురు, కాగా చిన్నతనం లోనే తండ్రి చనిపోవడంతో తన మేనత్త దగ్గరే పెరిగింది.

ఇక తాజాగా ట్విట్టర్ లో తాను బాలనటిగా నటించిన మొదటి సినిమాను గుర్తు చేసుకుంది ఐశ్వర్య. ఆ సినిమాయే బాపు దర్శకత్వంలో వచ్చిన రాంబంటు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించాడు. ఐశ్వర్య మేనత్త కమెడియన్ అయిన శ్రీ లక్ష్మి షూటింగ్ కు వచ్చినప్పుడు బాపు దగ్గరకి తీసుకెళ్లింది. అలా ఈ సినిమాలో ఒక పాటలో రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆడిపాడింది. తిరిగి ఇరవై ఏళ్ళ తర్వాత వీళ్ళు కౌసల్య కృష్ణమూర్తి చిత్రంలో తండ్రి కూతుళ్లుగా నటించడం విశేషం. ఇక ప్రస్తుతం మలయాళ స్టార్ టొవినో థామస్ తో ARM అనే సినిమాలో నటిస్తుండగా, త్వరలో మరో తెలుగు సినిమాలోనూ నటించబోతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు