Bhola shankar : మెహర్ రమేష్ కు మరో పదేళ్లు వనవాసం తప్పదా.. ?

Bhola shankar

హిట్ సినిమాతో ఏ డైరెక్టర్ అయిన పాపులర్ అవుతాడు.. కానీ ఫ్లాప్ సినిమాలతో పాపులర్ అయ్యేవాళ్ళకే ఒక రేంజ్ ఉంటుందనేట్టు ఉంది మెహర్ రమేష్ తీరు చూస్తుంటే.. ఒకటి, కాదు రెండు కాదు వరుసగా ఆయన తెలుగులో తీసిన నాలుగు సినిమాలకు నాలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి.

సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితేనే దర్శకుడికి మరో సినిమా పట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఇప్పటి వరకు మెహర్ రమేష్ కు ఫ్లాప్ మీద ఫ్లాప్ వస్తున్న కూడా పెద్ద హీరోల డేట్స్ పట్టుకొని, పెద్ద సినిమాలే చేసాడు. అయితే ఆయన చివరగా వెంకటేష్ తో చేసిన షాడో సినిమా, భారీ అంచనాల మధ్య రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఇక ఆ సినిమా రిజల్ట్ తో మెహర్ రమేష్ కు దాదాపు పదేళ్ల వరకు డైరెక్షన్ కు దూరమయ్యాడు. అయిన కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని పదేళ్లుగా ప్రయత్నించి చివరగా మెగా స్టార్ చిరంజీవితో సినిమా ఒకే చేయించుకున్నాడు మెహర్ రమేష్. ఇక సొంత కథలైతే వర్క్ అవుట్ అవ్వడం లేదనే విషయాన్నీ గ్రహించి వేదాళం రీమేక్ గా భోళా శంకర్ సినిమా తీసాడు.

- Advertisement -

భోళా సినిమా అయినా మెహర్ ను బయట పడేస్తుందేమో అనుకుంటే పరిస్థితి తారుమారైంది. అవుట్ డేటెడ్ స్టోరీ వల్ల , అలాగే ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలేవీ భోళా శంకర్ సినిమాలో లేకపోవడంతో ఈ సినిమా కూడా డిజాస్టర్ దిశగా అడుగువేస్తోంది. భోళా శంకర్ సినిమా ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మెగా స్టార్ కెరీర్ లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ తో, మరియు అతి తక్కువ థియేటర్ రన్ తో భోళా శంకర్ సరి కొత్త రికార్డ్ కూడా క్రియేట్ చేసే లాగా ఉంది.

షాడో సినిమా కూడా ఇదే విధమైన రిజల్ట్ ఇచ్చి మెహర్ రమేష్ ను పదేళ్లు ఇంట్లో కూర్చోబెట్టగా.. ఇక లేటెస్ట్ గా భోళా శంకర్ సినిమా కూడా మెహర్ రమేష్ ను మరో పదేళ్లు వనవాసం చేయించేలా ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు