Bhola Shanker: రిలీజ్ డేట్ లో ఏ మార్పు లేదు.. కన్ఫర్మ్ చేసిన చిత్ర యూనిట్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా చేస్తున్న లేటెస్ట్ మూవీ “భోళా శంకర్”. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. తమిళం లో హిట్ అయిన వేదాళం సినిమాను తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలు గా కీర్తి సురేష్ నటిస్తుంది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా నిరంతరం ఈ సినిమా షూట్ లో పాల్గొంటున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా భోళాశంకర్ సినిమా వాయిదా పడిందంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను వాయిదా వేసి ఇంకో మంచి డేట్ కోసం చూస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ తో చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.

మే1 న కార్మిక దినోత్సవం సందర్బంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో భోళా శంకర్ ఆగస్ట్ 11 నే విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చేసారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి టాక్సీ మీద కూర్చుని చాయ్ తాగుతున్నట్లు స్టిల్ విసిరారు. ఈ స్టిల్స్ చూస్తుంటే చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు సినిమాలు గుర్తుకువస్తున్నాయి. ఇక ఆ స్టిల్ లో టాక్సీ వెనకాల కలకత్తాకి సంబంధించిన లొకేషన్స్ కనిపించాయి. కాబట్టి ఈ సినిమా బ్యాక్డ్రాప్ అక్కడే జరుగుతుంది అనుకోవచ్చు. ఏది ఏమైనా గత కొద్దీ రోజులుగా భోళా శంకర్ వాయిదా అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు