Patriotic Films: తెలుగులో అమరవీరుల చరిత్రని చాటి చెప్పిన బెస్ట్ 5 మూవీస్!

Telugu Top 5 Best Patriotic Biopics

టాలీవుడ్ లో దేశభక్తి నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి, కానీ స్వాతంత్ర పోరాటయోధుల జీవిత చరిత్ర నేపథ్యంలో చిత్రాలు చాలా తక్కువ. కారణాలేంటో తెలియదుగాని చరిత్ర గుర్తించని తెలుగు వీరులు ఎందరో ఉన్నారు. అలాంటి వీరుల జీవిత చరిత్రను , మరియు దేశభక్తి స్ఫూర్తి రగిలించే సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలు ఇవే.

1. అల్లూరి సీతారామరాజు:
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో అల్లూరి గా కృష్ణ అద్భుత అభినయంతో ఆకట్టుకోవడమే గాక దేశభక్తిని పెంపొందించే డైలాగులు చెప్తున్నప్పుడు ప్రేక్షకుడిలో ఉత్తేజాన్ని నింపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపే సీన్ కి మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇక ఈ చిత్రంలో పాటలు ఇప్పుడు విన్నా గుండెల్లో రగిలిపోతుంది. 1920 ల కాలంలో విశాఖపట్నం ఏరియాల్లో బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టిన అల్లూరి వీరత్వాన్ని ఇప్పటికి అక్కడ కథలుకథలుగా చెప్తారు. ఇక ఈ సినిమాను ప్రతి సంవత్సరం ఆగష్టు 15న తెలుగు టీవీ ఛానెళ్లలో టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు.

2. ఆంధ్ర కేసరి:
ప్రముఖ దర్శక నటుడు విజయ్ చందర్ మెయిన్ లీడ్ గా నటించి నిర్మించిన సినిమా ఆంధ్ర కేసరి. స్వాతంత్ర పోరాట యోధుడు టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో అపూర్వ విజయం సాధించింది. ప్రకాశం పంతులుగా విజయ్ చందర్ నటిస్తే, కందుకూరి వీరేశలింగం గా మురళీమోహన్ నటించారు. 1983లో వచ్చిన ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు గాని, ఆ రోజుల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

- Advertisement -

3. సైరా నరసింహారెడ్డి:
18వ శతాబ్దం లో బ్రిటిష్ వారిపై ఎదురుతిరిగిన మొట్టమొదటి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా టైటిల్ రోల్ చేయగా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో నరసింహారెడ్డిగా చిరంజీవి నటన సినిమాకి ఊపిరి పోసింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు మరోఎత్తు. నాలుగేళ్ళ కిందట విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ వారు ఉరి తీసి 30ఏళ్ళ పాటు కోటపై వేలాడదీశారని అక్కడి ప్రజలు అంటారు. అంటే ఆయన బ్రిటిష్ వారిని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టుంటారో అర్ధం చేసుకుకోవచ్చు.

4.ఘాజి:
1971లో జరిగిన ఘాజీ జలాంతర్గామి యుద్ధ నేపథ్యంలో వచ్చిన ఘాజి అనే ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. భారతదేశంలో వచ్చిన స్వాతంత్రోద్యమ చిత్రాల్లోనే ఘాజి చాలా ప్రత్యేకమైంది. అప్పటివరకు ఆర్మీ నేపథ్యంలో, నౌక దళ నేపథ్యంలో, నేవి నేపథ్యంలో, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో చాలా చిత్రాలే వచ్చినా జలాంతర్గామి(సబ్ మెరైన్ ) నేపథ్యంలో వచ్చిన ఫస్ట్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. రానా కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో రూపొందింది. ఆర్ట్ ఫిల్మ్ లా సాగే ఈ సినిమా చూస్తున్నంత సేపు నరాలుతెగే ఉత్కంఠతో సాగుతుంది. ఇప్పటి జనరేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

5. మేజర్:

2008 లో జరిగిన ముంబై దాడుల నేపథ్యంలో వచ్చిన చిత్రం “మేజర్”. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ తో సాగుతుంది. ముంబై దాడుల్లో మారణ హోమం సృష్టించిన టెర్రరిస్ట్ లని ఏ విధంగా మట్టుపెట్టాడో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో సందీప్ చనిపోయినపుడు అతడి తండ్రి చెప్పే మాటలు ఎంతో స్ఫూర్తిని రగిలిస్తాయి. తెలుగులో తెరకెక్కిన ఉత్తమ బయోపిక్ చిత్రాల్లో ఇది ఒకటి. ఇక ఈ చిత్రంలో సందీప్ ఉన్ని కృష్ణన్ గా నటించిన అడవిశేష్ తన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసాడు. శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు