Krishna: “అల్లూరి”తోనే సూపర్ స్టార్ కృష్ణ – ఎన్టీఆర్ మధ్య గొడవ?

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన “అల్లూరి సీతారామరాజు” ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అల్లూరి సీతారామ రాజు అంటే కృష్ణ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేరు. ఆ రోజుల్లోనే నిర్మాతలకు కల్లెక్షన్ల వర్షం కురిపించడమే గాక తెలుగులో స్వాతంత్రోద్యమ నేపథ్యంలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఒకటి గా నిలిచింది.

అయితే ఈ సినిమా పలువురు బడా హీరోలను దాటుకుని కృష్ణ వరకు వచ్చింది ఈ సినిమా. నిజానికి ఈ సినిమా చేద్దామని ముందుగా అనుకున్నది ఎన్టీఆర్. ఆయన 1955 లోనే అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీద్దామని ఆ పాత్ర గెటప్ వేసుకుని కొన్ని ఫోటోషూట్స్ కూడా చేసారు. అయితే కొన్ని కారణాల చేత అది పట్టాలెక్కలేదు. అటు ప్రముఖ దర్శకులు కే.ఎస్ ప్రకాష్ రావు కూడా ఏఎన్ఆర్ తో ఈ బయోపిక్ తీద్దామనుకున్నారు. కానీ ఏఎన్ఆర్ వద్దన్నారు. ప్రముఖ నిర్మాత డి.ఎల్ నారాయణ కూడా శోభన్ బాబు తో బయోపిక్ ప్లాన్ చేసారు. కానీ బడ్జెట్ ఎక్కువవుతుంది వదిలేసారు.

ఫైనల్ గా ఆ సినిమా సూపర్ స్టార్ కృష్ణ చేతికి వచ్చింది. అయితే ఈ సినిమా తీయకముందే 1968 లో వచ్చిన అసాధ్యుడు అనే సినిమాలో కృష్ణ సీతారామరాజు పాత్రలో కాసేపు నటించారు. ఆ తర్వాత కృష్ణ తనే సినిమా తీయాలని డిసైడ్ అయ్యి సొంత బ్యానర్ అయిన పద్మాలయ స్టూడియోస్ నిర్మాణంలో వి. రామ చంద్రరావు దర్శకుడిగా అల్లూరి సీతారామరాజు చిత్రం తెరకెక్కడం జరిగింది.

- Advertisement -

దాదాపు 38రోజుల్లో 25 లక్షల భారీ వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు కృష్ణ కి ఈ పాత్ర చేయడం విరమించుకోమని పలువురు నిర్మాతలు సలహా ఇచ్చారు. కానీ కృష్ణ ఇవేమి పట్టించుకొలేదు. చివరికి ఈ సినిమాలో కమెర్షియల్ ఎలిమెంట్స్ లేవని సినిమా కొనుక్కోవడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. ఫైనల్ గా తారకరామా ఫిలిమ్స్ వారికీ తక్కువ రేటుకి కొన్ని ఏరియాలని విక్రయించారు. ఇక ఈ సినిమా తీస్తుండగానే మధ్యలో డైరెక్టర్ చనిపోతే, మిగిలిన భాగాన్ని కృష్ణ కొంత భాగం, కే.ఎస్. ఆర్. దాస్ మరికొంత భాగం తెరకెక్కించారు.

ఫైనల్ గా అన్ని అడ్డంకుల్ని దాటుకుని 1974 మే7న విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రం అఖండ విజయం సాధించింది. పాత రికార్డుల్ని తిరగరాస్తూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ రోజుల్లోనే 2కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో చనిపోయే సీన్ కి కన్నీళ్లు పెట్టుకొని ప్రేక్షకుడు ఉండడు. ఈ సినిమాలో తెలుగు వీర లేవరా అనే పాట స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ఆ రోజుల్లో ప్రజల్ని ఉత్తేజపరిచింది. అంతే కాదు ఈ పాట రాసిన మహా కవి శ్రీశ్రీ కి నేషనల్ అవార్డు లభించింది.

అయితే అక్కడే అసలు గొడవ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా తియ్యాలనుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా విడుదలైనప్పటినుండి కృష్ణ తో కొంచెం దూరంగా ఉన్నారు. పలు కార్యక్రమాల్లో కలిసినా పెద్దగా మాట్లాడే వారు కాదు. ఓవరాల్ గా ఈ సినిమా తియ్యాలన్న కోరిక మాత్రం ఎన్టీఆర్ మనసులో గట్టిగా ఉండేది. అందుకే పలుమార్లు విరమించుకున్నా కూడా చివరి ప్రయత్నంగా పరుచూరి బ్రదర్స్ ని సంప్రదించి స్క్రిప్ట్ రాయమన్నారు.

అయితే అప్పుడు వారు ఎన్టీఆర్ ని ఒక్కసారి కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం ఒక్కసారి చూడమని చెప్పారు. ఆ సినిమా చుసిన తర్వాత కూడా తీద్దామంటే స్క్రిప్ట్ రాస్తామన్నారు. వెంటనే ఎన్టీఆర్ డైరెక్ట్ గా కృష్ణ నే పిలిపించుకుని, “బ్రదర్ మీ అల్లూరి బయోపిక్ సినిమా చూస్తానని చెప్పగా”, వెంటనే ఎన్టీఆర్ కోసం కృష్ణ స్పెషల్ స్క్రీనింగ్ వేయించారు. ఫైనల్ గా ఆ సినిమా చుసిన ఎన్టీఆర్.. కృష్ణ ని అభినందిస్తూ బ్రదర్ అల్లూరి సీతారామరాజు పాత్ర మీరు తప్ప ఎవరు చేయలేరు అని అంటూ ఆ సినిమా తీయాలనే ఆలోచనని విరమించుకున్నారు.

కానీ మనసులో మాత్రం కృష్ణ ఎన్టీఆర్ మధ్య భేదాభిప్రాయాలు ఉండేవి. పలు సార్లు రాజకీయంగా ఇద్దరు పోటీపడిన సందర్భాలున్నాయి. ఓ దశలో ఈ వివాదం పీక్స్ కి చేరి ఎన్టీఆర్ కి కృష్ణ వ్యతిరేకంగా సినిమాలు తీసే దాకా వెళ్ళింది. కానీ తర్వాత మళ్ళీ కలిసిపోయారు. రాజకీయంగా కొంచెం దూరంగానే ఉన్నా వ్యక్తిగతంగా సొంత అన్నదమ్ముల్లా మెలిగేవారు ఎన్టీఆర్.. కృష్ణ.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు