Nikhil: స్పై బిజినెస్ తగ్గింపు.. అయినా ఏ మార్పు లేదు?

నిఖిల్ సిద్ధార్థ్ నటించిన “స్పై” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డల్ గా పెర్ఫార్మ్ చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత కలెక్షన్లు మరింత తగ్గుముఖం పట్టాయి. ఒకవైపు దీనికి పోటీగా రిలీజ్ అయిన సామజవరగమన బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ల తో దూసుకుపోతుంటే ఎన్నో అంచనాలతో వచ్చిన “స్పై” మాత్రం కనీసం ఒక్క షో కూడా హౌస్ ఫుల్ పడకుండా థియేటర్లలో నుండి నిష్క్రమిస్తుంది.

మొదటిరోజు ఓ రేంజ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన స్పై చిత్రం ఆ తర్వాత మాత్రం అందులో సగంలో సగం కూడా రాబట్టలేకపోతుంది. అందుకే ఈ చిత్ర యూనిట్ సినిమా బిజినెస్ ని 2కోట్లకి తగ్గించింది. దాంతో స్పై సినిమా టార్గెట్ 16.50 కోట్లకి మారింది. అయినా సరే 5వ రోజు స్పై సినిమా దారుణమైన కలెక్షన్లు సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 17లక్షల షేర్ మాత్రమే వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 28లక్షలు రాబట్టింది.

ఇక విడుదలైన 5 రోజుల్లో స్పై చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10.26కోట్ల షేర్ ని. 16.70 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. కుదించిన బిజినెస్ ని బట్టి ఈ సినిమాకి ఇంకా 6 కోట్లయినా రాబట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి. ఒక రకంగా ఈ సినిమాకి దెబ్బ పడింది ప్రొమోషన్ల లోపం వల్లే అని చెప్పాలి. ఇక నిర్మాతలు చెయ్యాల్సిందేంటంటే వచ్చే కలెక్షన్లలో లెక్క సరిచేసుకొని ఓటిటి సంస్థలతో మరోసారి డీలింగ్ చేసుకుని “స్పై” సినిమాను తొందరగా ఒటిటి లో రిలీజ్ చేస్తే నష్టాల నుండి తప్పించుకోవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు