NTR arts : బింబిసార 2పై ఊహించని ట్విస్ట్… కళ్యాణ్ రామ్ సంచలన నిర్ణయం?

నందమూరి కళ్యాణ్ కెరీర్ పెద్దగా హిట్స్ లేకుండా, వరుసగా ఫ్లాప్ లు వస్తున్న సమయంలో వచ్చిన సినిమా బింబిసార. కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. బింబిసార చిత్రం ఒక కళ్యాణ్ రామ్ కి మాత్రమే, కాదు… టాలీవుడ్ కి బూస్ట్ ఇచ్చింది. కరోనా సమయంలో ప్రేక్షకులు థియేటర్స్ వస్తరా లేదా ? అనుమానాలను బింబిసార తొలగించింది. సినిమా బాగుంటే, అదే సూపర్ హిట్ అవుతుందని, అది కరోనా లాంటి కఠిన సమయం అయినా సరే అని బింబిసార నిరూపించింది.

అంత అద్భుతంగా యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ బింబిసార చిత్రాన్ని తెరకెక్కించాడు. బింబిసార క్లైమాక్స్ చూసిన తర్వాత సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. తర్వాత డైరెక్టర్ వశిష్ట్, హీరో కమ్ నిర్మాత కళ్యాణ్ రామ్ బింబిసార 2 వస్తుందని చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. మధ్యలో బింబిసార 2 పై అనేక రూమర్స్ వచ్చాయి. బింబిసార 2 క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై డైరెక్టర్ వశిష్ట్ స్వయంగా స్పందించి, కళ్యాణ్ రామ్ చేస్తున్న డేవిల్ సినిమా తర్వాత బింబిసార 2 ఉంటుందని చెప్పాడు.

ఇది ఇలా ఉండగా, బింబిసార 2పై మరోసారి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే? బింబిసార 2 నుంచి డైరెక్టర్ వశిష్ట్ తప్పుకున్నాడట. దీంతో కళ్యాణ్ రామ్.. బింబిసార 2 కోసం మరో డైరెక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నాడని గుస గుసలు వినిపిస్తున్నాయి. కాగా, వశిష్ట్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చిరంజీవితో సినిమా కారణంగా బింబిసార2 నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆ వార్తలు చెబుతున్నాయి.

- Advertisement -

అయితే బింబిసార 1 సమయంలో తన వద్ద బింబిసారపై పది వరకు కథలు ఉన్నాయని వశిష్ట్ చెప్పాడు. మరి ఇలాంటి బ్లాక్ బస్టర్ కథలను పెట్టుకుని బింబిసార2 ను ఎందుకు వదులుకుంటాడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. చిరంజీవితో సినిమా చేసిన తర్వాత బింబిసార2 చేసే అవకాశాలు ఉంటాయని, అంతేగానీ, ఈ చిత్రం నుంచి వశిష్ట్ తప్పుకునే అవకాశాలు తక్కువ అని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు