Mega Brothers Remunerations: మెగా బ్రదర్స్ మైండ్ సెట్ మారాల్సిందేనా..?

Mega Brothers Remunerations

‘మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ హీరోలు మాత్రమే కాదు టాలీవుడ్ కి మెయిన్ పిల్లర్స్ లాంటి వారు. చిరంజీవి 90ల కాలంలోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు. బిగ్గర్ ద్యాన్ బచ్చన్ అంటూ అప్పట్లో నేషనల్ మ్యాగజైన్స్ లో కవర్ పేజ్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినప్పటికీ పాన్ ఇండియా  హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. సినిమా బడ్జెట్ లో సుమారు 50శాతం పైగా రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలలో చిరు, పవన్ లు ముందుంటారు. అలా బడ్జెట్ లో సింహభాగం తీసుకొని చేసిన సినిమాలు హిట్ అయితే, ఓకే కానీ, ఏ మాత్రం తేడా జరిగినా నిర్మాతకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 50కోట్లు పైనే అని, అది సినిమా బడ్జెట్లో 50శాతానికి పైనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీని మీద ఏపీలో రాజకీయంగా ఎంత దుమారం రేగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక భోళాశంకర్ సినిమాకు గాను చిరంజీవి ఏకంగా 70కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడని, సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఆ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో.

ఈ క్రమంలో చ్చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల గత 5సినిమాల రెమ్యునరేషన్, బడ్జెట్, కలెక్షన్స్ మీద ఓ లుక్కేద్దాం.

- Advertisement -

చిరంజీవి:

ఖైదీ నెంబర్ 150: బడ్జెట్ – 50కోట్లు,

చిరు రెమ్యునరేషన్ – 33కోట్లు,

కలెక్షన్స్ – 105కోట్లు ( షేర్ )

 

సైరా నరసింహారెడ్డి: బడ్జెట్ – 250కోట్లు,

చిరు రెమ్యునరేషన్ – 40కోట్లు,

కలెక్షన్స్ – 240కోట్లు ( వరల్డ్ వైడ్ గ్రాస్ )

 

ఆచార్య: బడ్జెట్ – 100 – 140కోట్లు,

చిరు రెమ్యునరేషన్ – 50కోట్లు,

కలెక్షన్స్ – 75కోట్లు ( గ్రాస్ )

 

గాడ్ ఫాదర్: బడ్జెట్ – 100కోట్లు,

చిరు రెమ్యూనరేషన్ – 45కోట్లు,

కలెక్షన్స్ 59కోట్లు ( షేర్ )

 

భోళాశంకర్: బడ్జెట్ – 101కోట్లు, చిరు రెమ్యునరేషన్ – 70కోట్లు.

పవన్ కళ్యాణ్:

కాటమరాయుడు: బడ్జెట్ – 35కోట్లు,

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ – 8.5కోట్లు

కలెక్షన్స్ 61కోట్లు ( షేర్ ).

 

అజ్ఞాత వాసి: బడ్జెట్ – 70కోట్లు,

పవన్ రెమ్యునరేషన్ – 20కోట్లు,

కలెక్షన్స్ – 95కోట్లు.

 

వకీల్ సాబ్: బడ్జెట్ – 145కోటు,

పవన్ రెమ్యునరేషన్ – 50కోట్లు,

కలెక్షన్స్ – 135కోట్లు ( గ్రాస్ )

 

భీమ్లా నాయక్: బడ్జెట్ – 75కోట్లు,

పవన్ రెమ్యునరేషన్ – 50 కోట్లు

కలెక్షన్స్ – 95కోట్లు ( షేర్ )

బ్రో : ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 50కోట్లకు పైగా రెమ్యునరేషన్, బడ్జెట్ పై ఏపీలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఎక్జాక్ట్ ఫిగర్స్ పై క్లారిటీ లేదు.

మొత్తానికి మెగా బ్రదర్స్ ఇద్దరు, సినిమా బడ్జెట్ లో 50శాతానికి పైగా రెమ్యునరేషన్ తీసుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ దీని వల్ల ఏ నిర్మాత నష్టపోలేదు. రిలీజ్ కి ముందే ప్రతి సినిమాకు ఫ్యాన్సీ రేట్ తో థియాట్రికల్ బిజినెస్ జరగటం, శాటిలైట్, డిజిటల్ రైట్స్ కి మంచి ఆఫర్స్ రావటంతో రిలీజ్ కి ముందే నిర్మాతలు ప్రాఫిట్స్ అందుకున్న పరిస్థితి ప్రతి సినిమాకి ఉంటుంది. అయితే, సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే నష్టపోయేది మాత్రం బయ్యర్లు మాత్రమే. ఈ నేపథ్యంలో బడ్జెట్లో సింహభాగం రెమ్యునరేషన్ తీసుకుంటున్న మెగా బ్రదర్స్ సినిమా క్వాలిటీ విషయంలో కూడా బాధ్యత తీసుకుంటే బాగుంటుందని కామెంట్స్ వినిపిస్తున్న క్రమంలో మెగా బ్రదర్స్ మైండ్ సెట్ మార్చుకుంటారా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు