Actor Vijay Son: తండ్రి బాటలో కాదు… కాస్త కొత్తగా

Actor Vijay Son

ఇళయ దళపతి విజయ్ ఈ పేరును కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాతో తెలుగులోకి పరిచయమైనా విజయ్, తుపాకీ, బిగిల్, అదిరింది, మాస్టర్, బీస్ట్, వారసుడు వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వస్తున్న సినిమాలకు లాంగ్వేజ్ బారియర్స్ లేవు కాబట్టి, ఒక గొప్ప సినిమా ఏ భాషలో రిలీజైన ఆ సినిమాను చూడగల్గుతున్నారు ప్రేక్షకులు.

డబ్బింగ్ సినిమాలకు కూడా బాగుంటే బ్రహ్మరథం పడతారు తెలుగు ఆడియన్స్. రీసెంట్ రీ రిలీజైన సినిమాలకు కూడా తెలుగు ఆడియన్స్ రచ్చ చేసారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న లియో సినిమా గురించి కూడా ప్రేక్షకులు మంచి అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే విజయ్ అభిమానులకు ఇంకో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

విషయం ఏంటంటే సాధారణంగా దర్శకులు కొడుకులు హీరోలు అవ్వడం , హీరోల కొడుకులు హీరోలు అవ్వడం మనం సాధారణంగా చూస్తునే ఉంటాం. కానీ ఇక్కడ రేర్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొడుకు డెబ్యూ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ “లైకా” ప్రొడక్షన్స్ జాసన్ సంజయ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు