Nara Rohit New Movie: ప్రతినిధి మళ్లీ మొదలైంది

Nara Rohit New Movie

ప్రస్తుత కాలంలో సినీ పరిశ్రమలో అంత యాక్టివ్ గా లేకున్నా, ఒకప్పుడు మాత్రం విభిన్నమైన సినిమాలను ఎంచుకుని చేయడంలో నారా రోహిత్ ముందు ఉండేవాడు. కేవలం ఎంటెర్టైనమెంట్ మాత్రమే ఉన్న సినిమాలు కాకుండా తన సినిమాలో కొంత సామజిక బాధ్యతను కూడా రిఫెలెక్ట్ అయ్యేలా తన స్క్రిప్ట్ సెలక్షన్స్ లో చూస్కునేవాడు.

బాణం సినిమాతో తెలుగు సినీపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్, తన రెండవ సినిమా “సోలో” తోనే మంచి సక్సెస్ అందుకుని మంచి పేరును సాధించాడు. ప్రతినిధి , రౌడీ ఫెలో , అసుర, అప్పట్లో ఒకడు ఉండేవాడు వంటి అద్భుతమైన సినిమాలు నారా రోహిత్ కెరియర్ లో ఉన్నాయి. ఐతే రోహిత్ కెరియర్ లో ప్రతినిధి ఒక బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.

ఒక సాధారణ యువకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి, సిస్టమ్ వలన సామాన్య ప్రజలు పడే ఇబ్బందిని నాయకులకు తెలిసేలా ఎత్తి చూపుతాడు ఈ సినిమాలో హీరో. ఈ సినిమా అప్పట్లో డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ప్రతినిధి -2 అంటూ ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు నారారోహిత్. ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభం అయింది.

- Advertisement -

ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 25 , 2024 న విడుదల కానుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు