Nayanthara: ఆ డాన్సర్ హీరోతో నయనతార రొమాన్స్

Nayanthara

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు ప్రభు దేవా, శింబు లాంటి కొంతమంది ప్రముఖులతో లవ్ ఏఫైర్స్ నడిపి నిత్యం వార్తలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న నయనతార ఇటీవలనే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో హ్యాపీ గా మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తుంది.

ఒక పక్క మ్యారేజ్ లైఫ్ ను సంతోషంగా గడుపుతునే నయనతార మరో పక్క కోలీవుడ్ లో వరుస సినిమాలతో సందడి చేస్తుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వస్తోన్న జవాన్ సినిమాలో నటించిన నయనతార లేటెస్ట్ గా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది.

అయితే నిజానికి జవాన్ లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత నయనతార చిన్న, చితక స్టార్స్ తో సినిమాలు చేయడం మానేసి కేవలం స్టార్ హీరోల సినిమాలపైనా మాత్రమే ఫోకస్ చేస్తుందనుకుంటే నయనతార మాత్రం అలా కాకుండా ఒక డాన్సర్ హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అయింది. అయితే డాన్సర్ హీరో అంటే మరేవరో కాదు హర్రర్ కామెడీ సినిమాల స్పెషలిస్ట్ రాఘవ లారెన్స్.

- Advertisement -

ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్న రాఘవ లారెన్స్..ఈ సినిమా తరువాత రత్న కుమార్ అనే దర్శకుడి డైరెక్షన్ లో ఒక హర్రర్ కామెడీ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు