Tabu’s Beauty Secret: టబు ఆ క్రీమ్ ఎందుకు వాడుతుందో తెలిస్తే షాక్ అవుతారు..!

Tabu’s Beauty Secret

తన అందంతో, నటనతో కుర్రకారును తన మాయలో పడేసిన బ్యూటీల్లో టబు ఒకరు. ఈమె పక్కా హైదరాబాదీ నటి. హైదరాబాద్ ముస్లిం కుటుంబంలో పుట్టిన టబు స్కూలింగ్ కూడా ఇక్కడే చేసింది. ఆ తర్వాత చదువు కోసం ముంబైకి వెళ్లిన టబు అక్కడే మోడలింగ్ చేసింది. ఆ తర్వాత మొదట హీరోయిన్ గా హిందీ సినిమా ఇండస్ట్రీలో డెబ్యు చేసింది. 17 ఏళ్ల వయసులో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా కూలీ నెంబర్ 1 సినిమాతో తొలిసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఈ అమ్మడు ఒకప్పుడు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి రాణించింది టబూ. 51 ఏళ్ల టబూ ఇప్పటికి ఒంటరిగా ఉంది. ఆమె ప్రేమ జీవితం గురించి, ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేదానిపై చాలా పుకార్లు ఉన్నాయి. ఇండస్ట్రీలో తన అందచందాలతో కుర్రాళ్లను నిద్ర పట్టకుండా చేసిన ఈ బ్యూటీ ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తన వయసుకు తగ్గ పాత్రల్లో కనిపించి మెప్పిస్తుంది.
అయితే ఈ వయసులో కూడా టబు ఇంత అందంగా ఉండడానికి ఓ సీక్రెట్ ఉందట. టబు ఇంత హాట్ గా ఉండడానికి కారణం ఆమె వాడే ప్రోడక్ట్ అని అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఆమె వాడే ఒక్కొక్క క్రీమ్, ముఖానికి రాసుకునే ప్రోడక్ట్ కి కొన్ని లక్షలు ఖర్చు చేస్తుందట. ముఖ్యంగా ఫేస్ మీద పింపుల్స్ రాకుండా, గుంతలు పడకుండా కనిపించడానికి రాసే క్రీమ్ లక్షల్లోనే ఉంటుందని తెలుస్తుంది. అలా కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ కే డబ్బు కోట్లు ఖర్చు పెడుతుందని బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు