Superstar’s170: తలైవర్170 లో మరో సప్రైజ్.. కీలక పాత్రలో మరో నటి?

Superstar’s170:

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏడుపదుల వయసులో కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా ఉన్నాడు తలైవా. అసలు విషయానికొస్తే జై భీం ఫేమ్ జ్ఞానవేల్ రాజా తో రజినీకాంత్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. జైలర్ తర్వాత రజిని చేస్తున్న సినిమా కావడంతో, పైగా “జై భీం” సక్సెస్ తర్వాత జ్ఞానవేల్ రాజా నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

వర్కింగ్ టైటిల్ తలైవర్170 గా ఉన్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా, టాలీవుడ్ హీరో శర్వానంద్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడంటూ మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో టాలీవుడ్ నటి కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆమె ఎవరో కాదు ఒకప్పటి విలక్షణ నటి, హీరో రాజశేఖర్ భార్య అయిన జీవిత. పలు రకాల సామాజిక సేవ కార్యక్రమాల్లో బిజీగా ఉండే జీవిత నటన కి దూరమై పాతికేళ్ల పైనే అయింది. అయితే అప్పుడప్పుడు తన భర్త రాజశేఖర్ సినిమాలకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటుంది.

- Advertisement -

ఇక తలైవర్170 సినిమాలో జీవిత రజినీకాంత్ కి చెల్లెలి పాత్రలో నటిస్తుందంటూ తాజాగా చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. ఇక ఈ సినిమాతో జీవిత సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ అవబోతుందనే చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయక తప్పదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు