Thalaivar170: జై భీమ్ డైరెక్టర్ తో తలైవా కొత్త సినిమా

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఫిక్స్ అయింది. ప్రముఖ దర్శకుడు జ్ఞానవేల్ రాజా తో ఈ సినిమా ఫిక్స్ అయింది. ఇంతకు ముందు జ్ఞానవేల్ రాజా తీసిన సినిమా జై భీమ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా ఎన్నో ప్రశంసలతో పాటు మరెన్నో అవార్డులు కూడా సాధించింది. అలాంటి దర్శకుడితో రజినీ కాంత్ తన 170 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ను లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించబోతోంది.

ప్రస్తుతం జైలర్ మూవీ షూటింగ్ లో ఉన్న రజినీ కాంత్ అది పూర్తి అవగానే ఈ సినిమాను ప్రారంభిస్తారు. అనిరుద్ ఈ సినిమా కు సంగీతం అందించనున్నారు.

అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమా లో రజినీకాంత్ ఒక ముస్లిం వ్యక్తి గా కనిపిస్తున్నాడు. అది కూడా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉంటుంది. రజినీకాంత్ గత సినిమాల్లో ముస్లిం పాత్రలు చాలా అరుదుగా చేసారు. 1995 లో వచ్చిన బాషా సినిమా అలాంటి పాత్రే. ఇక ఆయన స్టార్ కాకముందు కూడా కొన్ని సినిమాల్లో ముస్లిం క్యారెక్టర్స్ వేశారు. ఇప్పుడు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ముస్లిం క్యారెక్టర్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమా కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తయారు చేసిన కదా అని అన్నారు. జ్ఞానవేల్ రాజా ఇంతకు ముందు తీసిన జై భీమ్ కూడా నిజమైన సంఘటనల ఆధారంగా తీసినదే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు