Daksha Nagarkar: ప్రతి అమ్మాయి అలాంటి అబ్బాయిని కోరుకుంటుంది

ధక్ష నగర్కర్.. ‘హోరాహోరీ’ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ‘హుషారు’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ఎంతగానో మెప్పించింది. ఈ చిత్రంతోనే ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది దక్ష నగర్కర్. ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. ఇక నాగచైతన్య ‘బంగార్రాజు’ సినిమాలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది.

ఇక తరువాత అవకాశాలు దక్కించుకునే విషయంలో కొంతమేరకు ఎందుకో తడబడింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్ గా ఉంటుంది. తరచూ తన అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ కుర్ర కారు మతి పోగోడుతోంది. ఇదిలా ఉంటే.. సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రావణాసుర. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించింది హీరోయిన్ ధక్ష నగర్కర్.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధక్ష.. అక్కినేని నాగచైతన్య గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నాగచైతన్య నటించిన బంగార్రాజు మూవీలో ఈ ముద్దుగుమ్మ ఓ చిన్న పాత్రతో పాటు ఓ సాంగ్ లో కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అందరి ముందు ముద్దు పెట్టుకుని, కౌగిలించుకొని చేసే సన్నివేశాలలో నటించిన నాగచైతన్య.. ఆ తర్వాత తన దగ్గరికి వచ్చి సారీ చెప్పాడని తెలిపింది. ” చైతు చాలా స్వీట్ పర్సన్. చైతన్య లాంటి అబ్బాయిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. షూటింగ్ స్పాట్ లో కూడా నాగచైతన్య ఎప్పుడు కూల్ గా ఉంటూ అందరితో ఒకేలా ఉంటాడు. అమ్మాయిలను చాలా గౌరవిస్తాడు. బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలో నన్ను హగ్ చేసుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తరువాత వచ్చి సారీ చెప్పాడు” అని తెలిపింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు