Roopa Lakshmi: ప్రభాస్ అనే కాదు 70 ఏళ్ల వ్యక్తి అయినా ఓకే

వేణు ఎల్దండి దర్శకత్వంలో ఇటీవల చిన్నచిత్రంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం “బలగం”. ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా బలగం మాటే వినిపిస్తుంది. అంతలా గ్రామీణ ప్రజలను ఆకట్టుకుంటుంది ఈ చిత్రం. అయితే ఈ మూవీలో దాదాపు అందరూ కొత్త నటులే. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, వేణు మాత్రమే తెలిసిన ముఖాలు. ఇతర ప్రధాన పాత్రలకు కూడా వేణు పెద్దగా పేరు లేని నటులను తీసుకున్నారు. అది సినిమాకు ఎంతగానో ప్లేస్ అయింది. ఈ మూవీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న పాత్రల్లో లక్ష్మీ ఒకటి.

భర్త, అన్నాదమ్ముల మధ్య గొడవ కారణంగా పుట్టింటికి దూరమైన కూతురు లక్ష్మీ పాత్రలో నటించింది రూప లక్ష్మీ. ఈమె “నీది నాది ఒకే కథ, జాంబిరెడ్డి, సరిలేరు నీకెవ్వరు, మహర్షి వంటి తదితర చిత్రాలలో నటించింది. ఇక ఈ బలగం సినిమాలో హీరోయిన్ తల్లిగా, హీరోకి మేనత్త పాత్రలో నటించిన రూప లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబం గురించి, బలగం సినిమాలో ఆమె చేసిన హీరోయిన్ తల్లి పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “మా నాన్న రైతు. ఆయనకు ఆరుగురు సంతానం. నన్ను ఓ ఎకనామిక్స్ లెక్చరర్ కి దత్తత ఇచ్చారు. అయితే ఇప్పటికీ నేను నా కుటుంబ సభ్యులతో చక్కగా కలిసి ఉంటాను” అని తెలిపింది రూప లక్ష్మి.

ఈ క్రమంలోనే చిన్న వయసులోనే తల్లి పాత్రను పోషించారు కదా.. మరి రేపు ప్రభాస్ వంటి హీరోకు తల్లిగా చేయమని అడిగితే ఏం చేస్తారు అనే ప్రశ్నకి ఆమె మాట్లాడుతూ.. “మహిళ జీవితంలో సంతృప్తిగా ఉండే స్థానం ఏదంటే అమ్మ. కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నేను నటించడానికి సిద్ధమే. నాకేం సమస్య లేదు. ప్రభాస్ అనే కాదు 70 ఏళ్ల వ్యక్తికి కూడా అమ్మగా నటించాలని అడిగినా నాకేం ప్రాబ్లం లేదు” అని సీనియర్ నటి రూపలక్ష్మి చెప్పుకొచ్చారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు