NTR: బాలీవుడ్ స్పై యూనివర్స్ లోకి టాలీవుడ్ బాద్ షా

బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ తమ సంస్థ నుండి ఇటీవల YRF స్పై యూనివర్స్ ని ఎనౌన్స్ చేసింది. సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో YRF లాంటి అగ్ర సంస్థ నుండి ఇలాంటి అప్డేట్ రావడంతో సినీ ప్రేమికులలో ఆనందం నెలకొంది. యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నుండి ఇటీవల విడుదల అయినా “పఠాన్ ” సినిమా బాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోసింది. వరుస ప్లాప్ లతో ఉన్న షారుఖ్ కి ఈ సినిమా రిలీఫ్ ని ఇచ్చింది. అందరిని ఆశ్చర్య పరిచేలా బాక్స్ ఆఫీస్ ముందు కాసుల వర్షం కురిపించి, 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, మళ్ళీ ఇంకో యాక్షన్ సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫాన్స్ లో కొత్త జోష్ వచ్చింది. కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమా చాలా రోజుల క్రితమే ఒకే అయినా, కానీ షూటింగ్ మాత్రం ఈ మధ్యనే మొదలయింది. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే తారక్, మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. YRF స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న వార్ 2 లో ఎన్టీఆర్ ఫైనల్ అయినట్టు సమాచారం.

వార్ 1 కు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, హృతిక్ రోషన్, టైగర్ ష్రఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ, వార్ 2 లో హృతిక్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ వార్ 2 చిత్రం NTR30 తర్వాతే వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే ప్రశాంత్ నీల్ తో వచ్చే మూవీ NTR32 గా మారనుందని తెలుస్తోంది. అయితే వార్ 2పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు