Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ సప్రైజ్..!

Pawan kalyan:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల కిందట ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా మీద ఎక్కువ దృష్టి పెట్టడం, మరో పక్క రాజకీయాల్లో బిజీఅయిపోవటంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే ఓజి సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయటానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా సినిమా యూనిట్ ఫ్యాన్స్ కి సప్రైజ్ అప్డేట్ వచ్చింది. పవన్ కి బర్త్ డే విషెస్ చెప్తూ మైత్రి మూవీ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.

మైత్రి మూవీస్ రిలీజ్ చేసిన పోస్టర్లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఖాకి రంగు చొక్కా, గళ్ళ లుంగీలో ఓర కత్తి పట్టుకుని కూర్చుని ఉన్న పవన్ వింటేజ్ మాస్ లుక్ లో ఉండి ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చాడు. దానికితోడు పవన్ లుక్ చూడ్డానికి గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి లా ఉండడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ లుక్ తో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాదు అనుకున్న పలువురి వాదనలను కొట్టి పారేసి ఫ్యాన్స్ కి ఒక హోప్స్ వచ్చేలా చేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ మాత్రం రెండు వారాలు మాత్రమే జరగడంతో ఇంకా నెల రోజుల వర్క్ మిగిలి ఉంది. దాంతో పవన్ హరీష్ కి డేట్స్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు