Pawan Kalyan : రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్.. పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ కన్ఫామ్

ఫ్యాన్స్ అంత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ వీడియో వచ్చేసింది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

2001లో వచ్చిన ఖుషి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ చేసిన దాదాపు సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే వచ్చాయి. బాలు, జల్సా లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచి ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిచ్చిన ఖుషి లాంటి కల్ట్ సినిమా ఇచ్చినంత సంతృప్తి ఇవ్వలేదనే చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ , పవన్ నుంచి ఖుషి తరువాత వచ్చిన ఏ సినిమాని కూడా హిట్ కింద లెక్క చేయలేదు. ఒకటి, రెండు ప్లాప్ సినిమాలు వస్తానే హీరోగా నిలబడటం కష్టమైన సినీ పరిశ్రమలో దాదాపు 9 ప్లాప్ సినిమాలు వచ్చిన, ఇంచ్ కూడా తరగని క్రేజ్ తో పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. అప్పుడు వచ్చింది ఒక సినిమా అదే గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా, పవన్ సినిమాలకి థియేటర్ లో గోల చేసిన హరీష్ శంకర్, పవన్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఒక ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ ని ఎలా చూడాలనుకుంటున్నారో బాగా తెల్సిన హరీష్ శంకర్, పవన్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి గబ్బర్ సింగ్ సినిమా తీసాడు. అయితే ఇది సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమా రీమెక్ అయినప్పటి, ఎక్కడ కూడా రీమేక్ సినిమాలగా కనిపించకుండ, స్ట్రయిట్ సినిమాలాగే ప్రెసెంట్ చేసి పవన్ కళ్యాణ్ కి సాలిడ్ హిట్ ఇచ్చి, పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి హరీష్ శంకర్ అంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది. అయితే ఇన్నేళ్ల తరువాత మళ్లీ పవన్- హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.

కాసేపటి క్రితం రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. “ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, ఆధర్మం వృద్ధి నొందునో ఆయా సమయములనందు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్న.. అనే  సంస్కృత శ్లోకంతో మొదలైన గ్లిమ్స్  లో పవన్ అగ్రెస్సివ్ యాటిట్యూడ్ , వింటేజ్ మ్యానరిజంతో పవన్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియోకి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే పవన్, హరీష్ కాంబో మళ్ళీ గబ్బర్ సింగ్ రోజులను తిరిగి తీసుకొచ్చేలా ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు