Happy birth day Raj Tharun : యూట్యూబ్ నుంచి వెండితెర వరకు

సినిమాల మీద పిచ్చితో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిం చేసి, వెండితెరకి హీరోగా పరిచయమైన నటుడు రాజ్ తరుణ్. డైరెక్టర్ అవ్వాలనే కోరికతో చిన్న చిన్న కథలు రాసుకొని, వాటిలో నటించడానికి ఎవరు ముందుకి రాకపోయేసరికి తానే డైరెక్టర్ గా, యాక్టర్ గా చేసుకుంటూ షార్ట్ ఫిలిమ్స్ లో మంచి పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్, 2013 లో వచ్చిన “ఉయ్యాలా జంపాలా” సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. విరించి వర్మ అనే కొత్త దర్శకుడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

ఉయ్యాలా జంపాలా సక్సెస్ తో రాజ్ తరుణ్ రీసెంట్ గా వచ్చిన ధమాకా సినిమా ఫెమ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన “సినిమా చూపిస్త మావ” సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించటంతో, రాజ్ తరుణ్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత సుకుమార్ కథ అందించిన కుమారీ21f సినిమాలో నటించాడు. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో అతి తక్కువ మంది అచీవ్ చేసిన హ్యాట్రిక్ హిట్లని రాజ్ తరుణ్  తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న రాజ్ తరుణ్ కెరీర్ కుమారి21f సినిమా తరువాత వచ్చిన ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. కథల విషయంలో జాగ్రత్త వహించని రాజ్ తరుణ్ తీరు ఆయన కెరీర్ ని వెనక్కి నెట్టింది.

మరో పక్క ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువై పోయేసరికి రాజ్ తరుణ్ ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అయిపోయాడు. అడపాదడపా సినిమాలు చేస్తున్న కూడా రాజ్ తరుణ్ ఇంతవరకు మళ్ళీ కుమారి 21f రేంజ్ సక్సెస్ అయితే మళ్ళీ చూడలేదు. ఒకప్పుడు పట్టిందల్ల బంగారం అయిన రాజ్ తరుణ్ చేతిలో ఇప్పుడు అసలు సినిమాలే లేని పరిస్థితి ఎదురైంది. అయితే రాజ్ తరుణ్ ఈ మధ్యనే అహా నా పెళ్ళంట అనే ఒక వెబ్ సిరీస్ చేసాడు. ఫ్యామిలీ ఫన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రాజ్ తరుణ్  డైరెక్షన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసాడంట. యాక్టర్ సక్సెస్ అయిన మరి రాజ్ తరుణ్, డైరెక్టర్ గా కూడా సక్సెస్ అవుతాడో లేదో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు