Ismart shankar2 : రామ్ బర్త్ డేకి ఫ్యాన్స్ కి పండగే !

రామ్ పోతినేని పుట్టిన రోజు ఈ నెల 15న వస్తుండటంతో రామ్ తన ఫ్యాన్స్ కి ఆయన నెక్స్ట్ సినిమా అప్డేట్స్ తో ఫుల్ జోష్ నింపడానికి రెడీ అయ్యాడు. చాక్ లెట్ బాయ్, లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరో అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీలో ఉన్న దాదాపు స్టార్ట్ హీరోలందరికీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్, కొన్నేళ్లుగా ప్లాప్ సినిమాలతో సతమతమవుతుండగా పూరి మళ్ళీ తనకి బాగా కలిసొచ్చిన మాస్ జానర్ లోనే కథ రెడీ చేసి, రామ్ కి వినిపించి, సినిమాకి ఒప్పించి లవర్ బాయ్ రామ్ ని కాస్తా ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ గా మార్చాడు. 2019లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి పూరికి, రామ్ పోతినేని కి మంచి సక్సెస్ ని ఇచ్చింది .

ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తో రామ్ లవ్ స్టోరీ సినిమాలకి టాటా చెప్పి మాస్ సినిమాపై ఫోకస్ చేసాడు. కానీ ఇస్మార్ట్ తర్వాత రామ్ చేసిన ఏ సినిమాలేవి కూడా ఆశించినంత విజయం సాధించలేదు. తమిళ్ సూపర్ హిట్ సినిమా తాడం రీమేక్ గా వచ్చిన రెడ్ సినిమా, తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ది వారియర్ సినిమా రెండు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలిచాయి. అయిన సరే రామ్ మళ్ళీ వరుస మాస్ సినిమాలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు.

- Advertisement -

ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని రామ్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రామ్ ని మాస్ హీరోగా నిలబెట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఇస్మార్ట్ శంకర్ 2 రాబోతుందని గత కొద్దీ రోజులుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా రామ్ పుట్టిన రోజే రానుందంట. వీటితో పాటు రామ్ తరువాత ప్రాజెక్ట్స్ గురించి కూడా రామ్ బర్త్ డే రోజే అఫీషియల్ న్యూస్ లు రానున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈసారి రామ్ బర్త్ డే ఫ్యాన్స్ కి అప్డేట్స్ ల పండగ అయ్యేలా ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు