Power Star: ఒక్క వీడియోతో వేల నోళ్లు మూయించిన హరీష్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదలై సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండి ఇది తమిళ్ సినిమా తేరి కి రీమేక్ అని టాక్ రావటంతో పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అయితే ఇటీవల విడుదలైన గ్లిమ్ప్స్ వీడియోతో ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు హరీష్ శంకర్. ఇది రీమేక్ సినిమా లాగా ఉండదంటూ గతంలో పలు సార్లు హరీష్ శంకర్ స్పష్టం చేసినప్పటికీ సినిమాపై ఫ్యాన్స్ కి ఉన్న అనుమానాలు తీరలేదు. ఆ మధ్య రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోపై కూడా పెద్ద దుమారం రేగింది సోషల్ మీడియాలో.
అయితే, ఇటీవల విడుదలైన గ్లిమ్ప్స్ వీడియో ఫ్యాన్స్ కి ఉన్న అనుమానాలను తీర్చటంతో పాటుగా సినిమాపై ఉన్న నెగిటివిటీని కూడా తుడిచేసింది. ఫస్ట్ లుక్ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కేటాయించిన డేట్స్ 5,6 రోజులు మాత్రమే. ఇంత తక్కువ సమయంలోనే ఇంత మంచి క్వాలిటీతో ఫస్ట్ లుక్ రూపొందించటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వీడియోలో పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్ గబ్బర్ సింగ్ సినిమాని తలపించే విధంగా ఉండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. మరీ, ఫస్ట్ లుక్ వీడియోతో అంచనాలు పెంచిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలయ్యాక ఏ మేరకు అలరిస్తాడో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు