Santosh Soban: ఈసారైనా ‘శకునం’ కలిసొస్తుందా..?

సంతోష్ శోభన్, పేపర్ బాయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘బాయ్ టు ది నెక్స్ట్ డోర్’ లుక్స్ తో అందరి దృష్టి ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచిన్నప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ అందుకోలేకపోయాడు ఈ యువ హీరో. మధ్య వచ్చిన ‘మంచిరోజులొచ్చాయి’ సినిమా పర్వాలేదనిపించినా, ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ మారుతికి దక్కింది. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో అన్ని మంచి శకునములే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు సంతోష్ శోభన్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది. సంతోష్ సరసన మాళవిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ట్రైలర్ కి ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుండగా, విజువల్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రెండు కుటుంబాల చుట్టూ తిరిగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాకు లక్ష్మి భూపాల అందించిన డైలాగ్స్ కూడా ప్లస్ పాయింట్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఓ బేబీతో డీసెంట్ హిట్ అందుకున్న నందిని రెడ్డి నుండి వస్తున్న సినిమా కావటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. మే 18న రిలీజ్ కానున్న ఈ సినిమాకి దరిదాపుల్లో తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోవటం ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
సంతోష్ నటించిన గత చిత్రం ‘లైక్ షేర్ సబ్స్క్రైబ్’ డిజాస్టర్ అవటంతో ఈ సినిమా అతని కెరీర్ కి కీలకంగా మారింది. హీరోయిన్ మాళవిక నాయర్ కి కూడా సరైన హిట్ లేకపోవటంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అన్నీ మంచి శకునములే అన్న పాజిటివ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా సంతోష్ శోభన్ కి హిట్ ఇస్తుందో లేదో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి.
https://youtu.be/cElIwzRFtSQ

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు