Naga Chaitanya: కస్టడీ కూడా కన్నీరే మిగిల్చిందా..?

అక్కినేని హీరోలకు వరుస డిజాస్టర్స్ వస్తున్న తరుణంలో అటు హీరో నాగచైతన్య, ఇటు అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ సినిమా ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. రొటీన్ కథతో రూపొందిన ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా అంత గ్రిప్పింగ్ గా లేదని, ఎమోషనల్ కనెక్షన్ కూడా మిస్సయిందని అంటున్నారు. విభిన్న కథాంశాలకు ప్రసిద్ధి చెందిన వెంకట్ ప్రభు నుండి ఇలాంటి రొటీన్ కథను ఊహించలేదని అంటున్నారు ప్రేక్షకులు.
అరవింద్ స్వామి, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లోపించటం వల్ల కస్టడీ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయిందని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు పర్వాలేదనిపించినా, ఈ సినిమాని నిలబెట్టలేకపోయాయని టాక్ వినిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ కూడా ప్రధాన బలంగా ఉంటుంది, అలాంటిది కస్టడీ సినిమా విషయంలో ఏ మాత్రం ఆకట్టుకోని మ్యూజిక్ పెద్ద మైనస్ పాయింట్ అయ్యిందని తెలుస్తోంది. మరో పక్క వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఈ సినిమా నిరాశే మిగిల్చింది.
ఆ రకంగా నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమాతో మొదలైన అక్కినేని వారి డిజాస్టర్స్ పరంపరకి కస్టడీ సినిమా కూడా అడ్డుకట్ట వేయలేకపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే, ఏజెంట్ సినిమాకి ముందు అఖిల్ ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించినా కూడా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. కస్టడీ సినిమా విషయంలో కూడా నాగచైతన్య అంతే కాన్ఫిడెంట్ గా సినిమా మీద గట్టి నమ్మకం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ రిజల్ట్ లో తేడా ఏం కనపడలేదు. మొత్తానికి తొలిరోజు మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న కస్టడీ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు