Prabhas: యాక్షన్ సినిమాలంటే ప్రభాస్ కి విసుగొచ్చిందా..?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. ఈ క్రమంలో యాక్షన్ సినిమాలతో నిండిన ప్రభాస్ లైనప్ లో లవ్ స్టోరీ ఒక్కటి కూడా లేకపోవటంతో కొంత మంది ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే, ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే  విధంగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సీతారామం సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ కి ఒక లవ్ స్టోరీ వినిపించగా ప్రభాస్ ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతోంది. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఒక ఎంటర్టైనర్ సినిమాకి ఓకే చెప్పిన ప్రభాస్ ఇప్పుడు హను చెప్పిన లవ్ స్టోరీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్తలు వస్తున్న తరుణంలో ప్రభాస్ కి యాక్షన్ కథలంటే బోర్ కొట్టిందా అన్న కామెంట్స్ వస్తున్నాయి.
పాన్ ఇండియా హిట్ అందుకున్న తర్వాత దర్శకుడు హను పాన్ ఇండియన్ స్టార్స్ తోనే సినిమా చేయాలని ఎదురుచూస్తుండటంతో ప్రభాస్ తో సినిమా అంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది. ప్రభాస్ గత చిత్రం రాధేశ్యామ్ నిరాశ పరచటంతో తమ అభిమాన హీరో నుండి మరో లవ్ స్టోరీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో హను, ప్రభాస్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా అధికారిక ప్రకటన రాని ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు మొదలవుతుంది వంటి అంశాలు తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు