Ravi Teja: బోయపాటి కెరీర్ బెస్ట్ మూవీకి 18ఏళ్లు..!

మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో 2005 మే 12న విడుదలైన ‘భద్ర’ సినిమా నేటితో 18ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఈ సినిమా రవితేజ, బోయపాటిల కెరీర్లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. రవితేజ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ అందించిన సంగీతం కూడా ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా పాటలు ఈ నాటికీ చాలా మంది ఫేవరెట్ ప్లేలిస్ట్ లో ఉండటమే ఇందుకు నిదర్శనం. ఆకట్టుకునే లవ్ స్టోరీతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమా అప్పట్లో హిందీ, భోజ్ పురీ, మలయాళం భాషల్లోకి డబ్ అవ్వటమే కాకూండా తమిళ్ లో శింబు హీరోగా శరవణ పేరుతో, కన్నడలో గజ పేరుతో రీమేక్ అయ్యి, అక్కడ కూడా హిట్ గా నిలిచింది.
భద్ర సినిమా ద్వారా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి తర్వాత వెంకటేష్ తో తీసిన తులసి సినిమాతో మరో హిట్ అందుకొని టాప్ డైరెక్టర్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. బోయపాటి కెరీర్లో సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పటికీ భద్ర సినిమా మాత్రం ఎప్పటికీ స్పెషల్ గా నిలుస్తుందని చెప్పాలి.
దిల్ రాజు నిర్మాణంలో 6కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. భద్ర సినిమా రిలీజ్ అయ్యి 18ఏళ్ళవుతున్న కారణంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న కారణంగా ఈ సినిమా కూడా రీరిలీజ్ చేస్తే బాగుంటుందని రవితేజ అభిమానులు కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు