Samantha: ఖుషి హిట్.. అజ్ఞాతంలోకి నాగచైతన్య..?

Samantha:

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తొలిరోజే సూపర్ హిట్ టాక్ అందుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా. ఈ చిత్రానికి భారీగానే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత నటనకు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీకి ప్రీమియర్ షో నుంచి మంచి మార్కులు పడ్డాయి.

తమ తమ పాత్రల్లో విజయ్, సమంత జీవించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో సమంత మాజీ భర్త, టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కొద్ది రోజుల పాటు బయటకు రారని.. మీడియా ముందుకు వచ్చేందుకు కూడా చైతు ఇష్టపడడం లేదన్న పుకార్లు బయట వినిపిస్తున్నాయి. ఈ సినిమా లైవ్ ఈవెంట్ లో వేదిక మీదే విజయ్ దేవరకొండ – సమంత ఎంత రొమాంటిక్ గా డాన్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే విడాకులు అయ్యాక మీ మాజీ భార్య ఇలా చేయడంపై మీ స్పందన ఏంటి..? అని తరచూ ప్రశ్నలు తలెత్తడంతో దీనికి ఆన్సర్ చెప్పేందుకు కూడా చైతు ఇష్టపడరని.. ఇలాంటి ప్రశ్నలను ఫేస్ చేయడం ఇష్టం లేకే కొద్ది రోజులపాటు అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే చైతు అభిమానులు మాత్రం ఇవన్నీ లేనిపోని పుకార్లు అని.. విడాకులు అయ్యాక ఆమె ఏం చేసుకుంటే మా హీరోకి ఏం సంబంధం అని కౌంటర్లు వేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings,

and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు