Ranveer – Deepika : ఇన్ స్టాలో పెళ్లి ఫోటోలు డిలీట్… డివోర్స్ కి టైం వచ్చేసిందా…?

Ranveer- Deepika.. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్యకాలంలో ప్రతి విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు తెలియజేస్తున్నారు.. ఇదిలా ఉండగా సాధారణంగా ఒక జంట తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను లేదా తమ భాగస్వాములకు చెందిన ఫోటోలను తమ ఇంస్టాగ్రామ్ ఖాతాల నుండి తొలగిస్తే.. నిజంగా వారి మధ్య డివోర్స్ కి టైం వచ్చేసింది అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ జంట దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కూడా తమ ఇంస్టాగ్రామ్ ఖాతాల నుండి ఫోటోలు డిలీట్ చేశారని.. అందుకే వీరిద్దరి డివోర్స్ కి కూడా టైం వచ్చేసింది అంటూ ఒక వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకాలం సృష్టిస్తోంది.. హిందీ పరిశ్రమలో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని ఇప్పుడు యావత్ దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను దక్కించుకున్నారు ఈ జంట.. వీరి ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులకు మరింత నచ్చింది.. దాదాపు పది సంవత్సరాల వైవాహిక బంధానికి గుర్తుగా త్వరలోనే వీరి జీవితంలోకి ఒక కొత్త అతిధి కూడా రానున్నారు.. మరోవైపు గత ఏడాది జరిగిన ఒక షోలో దీపిక చేసిన కామెంట్స్ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకునే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది..

Ranveer - Deepika : Delete wedding photos on Instagram... Is it time for divorce...?
Ranveer – Deepika : Delete wedding photos on Instagram… Is it time for divorce…?

ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు , వీడియోలు డిలీట్ చేసిన రన్వీర్ సింగ్..

రణవీర్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. కానీ ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి దీపికా పదుకొనేతో పెళ్లికి సంబంధించిన అన్ని ఫోటోలు కూడా తొలగించారు.. మరొకవైపు రణవీర్ సింగ్ ఇంత సడన్గా పెళ్లి ఫోటోలను తొలగించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రణవీర్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో మొత్తం 133 పోస్ట్లు ఉండగా అందులో దీపికతో పెళ్లి ఫోటోలను మాత్రమే ఆయన తొలగించడం ఆశ్చర్యకరం.. మరొక షాకింగ్ విషయం ఏమిటంటే ఫోటోలే కాదు రన్వీర్ సింగ్ అన్ని పెళ్లి వీడియోలను కూడా డిలీట్ చేశారు.. అయితే దీపిక పదుకొనే ఇంస్టాగ్రామ్ లో మాత్రం పెళ్లి ఫోటోలు అలాగే ఉన్నాయి. దీంతో ఇప్పుడు కొత్త అనుమానాలు లేవనెత్తుతున్నాయి రణవీర్ సింగ్ దీపికా పదుకొనే మధ్య వాగ్వాదం మొదలైందని అందుకే రణవీర్ సింగ్ పెళ్లి ఫోటోలను, వీడియోలు తొలగించాని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు..

ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..

అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు బహుశా పొరపాటు వల్ల పెళ్లి ఫోటోలు కనిపించకుండా పోయి ఉండవచ్చు అని అభిప్రాయపడుతుండగా.. మరికొంతమంది అలా ఎలా కనిపించకుండా పోతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే విడాకులు అంటూ వస్తున్న వార్తలపై అటు దీపిక ఇటు రణవీర్ సింగ్ ఎవరో ఒకరు స్పందించక తప్పదు..

- Advertisement -

రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే సినిమాలు..

దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడి అనే చిత్రంలో నటిస్తోంది.. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతోంది దీపికా పదుకొనే. ఇక మరోవైపు రణవీర్ సింగ్ కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ మరికొన్ని సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ బిజీగా గడిపేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు