OG:”థమన్” ఉండగా అనిరుధ్ తో పనియేలా!

OG BGM:

టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా అరవ మ్యూజిక్ డైరెక్టర్ల హవా ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. హారిస్ జైరాజ్, యువన్ శంకర్ రాజా వంటి స్టార్ సంగీత దర్శకులు సినిమాలు తగ్గించాక, ఇప్పుడు జివి ప్రకాష్ కుమార్, సంతోష్ నారాయణన్ వంటి కొత్త సంగీత దర్శకుల ఊపు స్టార్ట్ అయింది. ముఖ్యంగా అనిరుధ్ అయితే తన మ్యూజిక్ తో సెన్సేషన్ సృస్ష్టిస్తున్నాడు. ఎక్కువగా తమిళ్ సినిమాలే చేస్తున్నప్పటికీ అన్ని భాషల్లోనూ ఇతనికి ఆదరణ ఉంది.

ఇక తెలుగులో అయితే అనిరుధ్ కి 10కోట్లయినా ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడట్లేదు. దానికి తన మాస్ బీజీఎమే మెయిన్ రీజన్. రీసెంట్ గా వచ్చిన జైలర్ తో మళ్ళీ ప్రూవ్ అయింది. అయితే అనిరుధ్ మాయలో పడి టాలీవుడ్ ఫ్యాన్స్, మేకర్స్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని ట్రేడ్ విమర్శకులు అంటున్నారు.

టాలీవుడ్ లో ఒకప్పుడు ఊపు ఊపిన మణిశర్మ లాంటి సంగీత దర్శకుల స్థాయిని అది కించపరచడమే అవుతుందని అంటున్నారు నెటిజన్లు. అయితే ఇప్పుడు టాలీవుడ్ తరపున బీజీఎమ్ స్పెషలిస్ట్ థమన్ తమిళ తంబిలకు సవాల్ విసురుతున్నాడు. ఒకప్పుడు మూసధోరణి మ్యూజిక్ తో విసుగు తెప్పించిన థమన్ ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫ్రెష్ ట్యూన్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని కామన్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ముఖ్యంగా అఖండ, భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ట్రెండ్ క్రియేట్ చేసాడు.

- Advertisement -

తాజాగా పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబోలో వస్తున్న “OG” గ్లిమ్ప్స్ కి బద్దలైపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించాడు. అందుకే ఇప్పుడు చాలా మంది నెటిజన్లు థమన్ కి సపోర్ట్ గా ట్వీట్లు వేస్తున్నారు. తెలుగులో ఇంతమంచి మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకుని అరవ మ్యూజిక్ డైరెక్టర్ల కోసం నిర్మాతలు డైరెక్టర్లు ఎందుకు పాకులాడుతున్నారని విమర్శకులు అంటున్నారు.

ఇప్పటికైనా టాలీవుడ్ హీరోలు, దర్శకులు మేల్కొని, థమన్ తో పాటు, కాల భైరవ, శ్రీ చరణ్ పాకాల లాంటి యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇస్తే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు థమన్ కూడా అనిరుధ్ లాగ హెవీ గా డిమాండ్ చేయకుండా సినిమాను బట్టే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఓజి కే ఈ రేంజ్ లో ఇస్తున్నాడంటే, రాబోయే గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలకు ఏ రేంజ్ లో ఇస్తాడో అని నెటిజన్లు లెక్కలేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు