HBD Pawan Kalyan: OG టీజర్‌లో ఈ మరాఠీ డైలాగ్‌ని గమనించారా? మీనింగ్ తెలుసా?

HBD Pawan Kalyan

పవర్ స్టార్ పవన కళ్యాణ్ నటిస్తున్న OG మూవీ గ్లింప్స్ ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయంది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ, గ్లింప్స్ అయితే ఓ రేంజ్‌‌లో ఉంది. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు ఇలాంటి పాత్ర చేయాలనే ఫ్యాన్స్ కోరుకున్నారు. గతంలో పంజా సినిమా వచ్చినా, అది పెద్దగా ఆడలేదు. అయినా, అలాంటి గ్యాంగ్ స్టార్ సినిమా చేయాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి చూస్తున్నారు.

లక్షల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఈ గ్లింప్స్‌తో డైరెక్టర్ సుజిత్ సాటిస్ఫై చేశాడని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు పవన్ కళ్యాణ్‌తో సమానంగా సుజిత్ పేరు కూడా వినిపిస్తుంది. దీనికి కారణం OG టీజర్ అనే చెప్పొచ్చు. అలాగే ఈ టీజర్ వీడియో విడుదలైన 20 నిమిషాల్లోనే ఎ పాన్ ఇండియా స్టార్‌కి సాధ్యం కానీ, రికార్డును క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా 200K లైక్స్ సాధించిన గ్లింప్స్ గా రికార్డు కొట్టేసింది.

అయితే టీజర్ ఎంత ఒకటి అయితే, చివరలో పవన్ కళ్యాణ్ కోపంతో ఊగిపోతూ మరాఠీలో ఒక డైలాగ్ చెబుతాడు. అది టీజర్‌కే హైలైట్‌గా ఉంది. ఈ డైలాగ్ విన్న తర్వాత ఫ్యాన్స్ కూడా ఊగిపోతున్నారు. ఆ డైలాగ్ ఏంటంటే?

- Advertisement -

ఖడే ఖడే క్యా దేఖ్ రహే హో… ఆగే కర్ హాథ్” అంటూ వచ్చే డైలాగ్ ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ నోట్లో కూడా తిరుగుతుంది. దీని మీనింగ్ ఏంటో కూడా తెలుసుకోకుండానే పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అంటూ వైరల్ చేస్తున్నారు. ఈ డైలాగ్ మీనింగ్ ఏంటంటే..? “నిలబడి ఏం చూస్తున్నవ్… చెయ్యి ముందుకు చాపు” అని అర్థం.

తన సినిమాల్లో పవన్ ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఖుషి సినిమాలో “యే మేరా జహా…” అంటూ ఓ తెలుగు సినిమాలో ఫస్ట్ టైం హిందీ సాంగ్‌‌ని యూజ్ చేశాడు. ఇప్పుడు OG సినిమాలో ఏకంగా మరాఠీ డైలాగ్‌ను వాడబోతున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ అని మరోసారి ప్రూఫ్ చేసుకున్నాడు అని అంటున్నారు క్రిటిక్స్ అండ్ ఫ్యాన్స్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు