HBD Pawan Kalyan: సురేందర్ రెడ్డికి ఎక్కడో సుడి ఉంది..!

HBD Pawan Kalyan

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రీసెంట్ గా ఏజెంట్ సినిమా ద్వారా ఘోర డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమా ఫేయిల్యూర్ కి కారణంగా అందరూ సురేందర్ రెడ్డినే పాయింట్ ఔట్ చేశారు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నెక్స్ట్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు సురేందర్ రెడ్డి.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో ఓ సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి ఆ మధ్య. ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు కానీ, ప్రస్తుతం మరో పవన్, సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర సమాచారం అందుతోంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్నాడని చాలా కాలం కిందట టాక్ వచ్చింది.
అయితే, పవన్ వరుస సినిమాలతో బిజీ అయిపోవటం, ఈ లోగా సురేందర్ రెడ్డికి ఏజెంట్ లాంటి డిజాస్టర్ పడటంతో, ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కటం కష్టమే అని అంతా భావించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని, ఈ రోజే సినిమా ఆఫీస్ కూడా ఓపెన్ చేశారని సమాచారం అందుతోంది.
నిర్మాత రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడు. ఓజి సినిమా పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సురేందర్ రెడ్డికి ఏజెంట్ లాంటి డిజాస్టర్ ఉన్నప్పటికీ, స్టైలిష్ టేకింగ్ కి స్పెషలిస్ట్ కావటంతో పవన్ ని డిఫరెంట్ గా చూపించగలడని నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత పవర్ స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ అంటే సురేందర్ రెడ్డికి ఎక్కడో సుడి ఉన్నట్లుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు